ఒక్కో సీటుకూ మూడు పేర్లు
ABN , Publish Date - Sep 27 , 2026 | 02:55 AM
వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్‌నగర్; వరంగల్-ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సమాయత్తమవుతోంది. రెండు స్థానాల్లో పోటీకి ఆసక్తి చూపుతున్న పార్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించిన విషయం తెలిసిందే.
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికకు అధిష్ఠానానికి జాబితా
హైదరాబాద్‌కు మన్నె సత్యనారాయణరెడ్డి, గౌరీ సతీశ్, సామ రామ్మోహన్ రెడ్డి
నల్లగొండకు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, పీవీ శ్రీనివాస్, చనగాని దయాకర్
అధిష్ఠానం వద్ద ప్రయత్నాలు చేసుకుంటున్న మరికొందరు ఆశావహులు
హైదరాబాద్, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్‌నగర్; వరంగల్-ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సమాయత్తమవుతోంది. రెండు స్థానాల్లో పోటీకి ఆసక్తి చూపుతున్న పార్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించిన విషయం తెలిసిందే. వాటిని వడపోసి.. ఒక్కో స్థానానికి ముగ్గురేసి అభ్యర్థుల చొప్పున జాబితాను అధిష్ఠానానికి పంపించినట్లు సమాచారం.
హైదరాబాద్ -రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానానికి డాక్టర్ మన్నె సత్యనారాయణ రెడ్డి (ఎంఎస్ఎన్ ల్యాబ్ అధినేత)తోపాటు గౌరీ సతీశ్, సామ రామ్మోహన్ రెడ్డి పేర్లు; వరంగల్-ఖమ్మం- నల్గొండ స్థానానికి మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి తనయుడు సర్వోత్తమ్ రెడ్డితోపాటు సమాచార కమిషనర్ పీవీ శ్రీనివాస్, చనగాని దయాకర్ పేర్లను పంపించినట్లు సమాచారం. మరోవైపు, ఇప్పటికే చాలామంది తమ అభ్యర్థిత్వం కోసం అధిష్ఠానం వద్ద మంతనాలు జరుపుతున్నట్లు తెలిసింది. రాష్ట్ర పార్టీ వర్గాలు పంపించిన అభ్యర్థులతోపాటు ఇతరులు కూడా బలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇక, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ జాబితా కోసం ఈనెల 28న నోటిఫికేషన్ రానుంది. ఓటర్‌గా నమోదుకు నవంబరు 6వ తేదీ దాకా అవకాశం ఇవ్వనున్నారు. తుది ఓటర్ల జాబితా డిసెంబరు 30న వెలువడనుంది.
ఈ వార్తలు కూడా చదవండి:
కొండా లక్ష్మణ్ త్యాగం భావి తరాలకు స్ఫూర్తి : సీఎం రేవంత్
మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలి
Read Latest AP News And Telangana News And International News And Telugu News