35 నిమిషాల్లోనే చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్.. గాలింపు చర్యలు ముమ్మరం చేశాం: డీఎస్పీ తిలక్
ABN , Publish Date - Jun 16 , 2026 | 07:09 PM
కాకినాడ జిల్లా తుని చిన్నారి జ్ఞానేశ్వరి కేసుపై పెద్దాపురం డీఎస్పీ తిలక్ పీసీ కీలక విషయాలు వెల్లడించారు. చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్నామని తెలిపారు.
కాకినాడ, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా తుని చిన్నారి జ్ఞానేశ్వరి కేసుపై (Gnaneswari case) పెద్దాపురం డీఎస్పీ తిలక్ (Peddapuram DSP Tilak) కీలక విషయాలు వెల్లడించారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్నామని తెలిపారు. ఈరోజు(మంగళవారం) డీఎస్పీ తిలక్ మీడియాతో మాట్లాడారు. 35 నిమిషాల వ్యవధిలో బాలిక మిస్సయిందని చెప్పుకొచ్చారు. చిన్నారి జ్ఞానేశ్వరి సమాచారం తెలిసిన వెంటనే గాలింపు చర్యలు చేపట్టామని స్పష్టం చేశారు. జీడీ పిక్కలు ఏరుకునే వారిని కూడా పిలిచి చిన్నారి గురించి విచారించామని తెలిపారు. పాప మిస్సయిన చోట బొమ్మలను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు.
చిన్నారిపై తప్పుడు వార్తలను ప్రచురిస్తే లీగల్‌గా చర్యలు..
చిన్నారికి సంబంధించి తప్పుడు వార్తలను ప్రచురించే వారిపై లీగల్‌గా చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తిలక్ హెచ్చరించారు. పాపను జంతువులు తీసుకెళ్లాయనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. జీడి పిక్కలను ఏరుకునే సంచార జాతుల వారిపై నిఘా పెట్టి విచారణ చేస్తున్నామని తెలిపారు. చిన్నారి జ్ఞానేశ్వరి కుటుంబం పెంచుకుంటున్న కుక్కకు నాలుగు రోజులుగా ఎలాంటి ఆహారం లేకపోవడంతోనే చనిపోయిందని వెల్లడించారు. కుక్క పోస్టుమార్టం రిపోర్టు రెండు రోజుల్లో వస్తుందని డీఎస్పీ తిలక్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌తో సీఎం చంద్రబాబు భేటీ.. ఏపీ అభివృద్ధిపై చర్చ
ఢిల్లీలో జనసేన సేన ప్రస్థానం సమావేశం.. 5 తీర్మానాలకు ఆమోదం
Read Latest AP News And Telangana News And National News
And Telugu News