Share News

Pawan Kalyan: ఫేక్ ప్రచారం చేస్తున్నారు.. జగన్ అండ్ కోకు పవన్‌ స్ట్రాంగ్ వార్నింగ్

ABN , Publish Date - Jan 09 , 2026 | 01:41 PM

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పిఠాపురంలో ఏ చిన్న ఘటన జరిగినా.. వైసీపీ నేతలు వైరల్ చేస్తున్నారని విమర్శలు చేశారు.

Pawan Kalyan: ఫేక్ ప్రచారం చేస్తున్నారు.. జగన్ అండ్ కోకు  పవన్‌ స్ట్రాంగ్ వార్నింగ్
Pawan Kalyan

పిఠాపురం, జనవరి9 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పిఠాపురంలో ఏ చిన్న ఘటన జరిగినా వైసీపీ నేతలు వైరల్ చేస్తున్నారని విమర్శలు చేశారు. అవాస్తవాలను వైరల్ చేయడం మానుకోవాలని సూచించారు. వైసీపీ ఫేక్ ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. ఏదైనా చెడగొట్టడం, కూలగొట్టడం చాలా తేలిక.. నిర్మించడం చాలా కష్టమని చెప్పుకొచ్చారు. ఇవాళ(శుక్రవారం) పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ప్రసంగించారు.


డబ్బు సంపాదనకు రాలేదు..

కూటమి స్ఫూర్తిని ఎవరూ దెబ్బతీయొద్దని వ్యాఖ్యానించారు. పార్టీలో నేతల మధ్య భిన్నాభిప్రాయాలు ఉండొచ్చని పవన్ కల్యాణ్ తెలిపారు. అందరినీ ఏకతాటిపై నడిపించడం చాలా కష్టమని చెప్పుకొచ్చారు. రాజకీయాల్లోకి తాను డబ్బు సంపాదించడానికి రాలేదని స్పష్టం చేశారు. సినిమాల్లో తాను బాగానే సంపాదించుకోగలనని చెప్పుకొచ్చారు. సినిమా ప్లాప్ అయినా డబ్బులు వస్తాయని వెల్లడించారు. ప్రపంచంలో ఏం జరిగినా పిఠాపురం ఎమ్మెల్యేదే తప్పా అని ప్రశ్నించారు. వైసీపీ నేతల నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందో అసలు తెలుస్తోందా? అని నిలదీశారు. సోషల్ మీడియాలో వైసీపీ నేతలు అబద్ధాలు వైరల్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. పిఠాపురం ప్రజలు తనకు కాపు కాయాలి కానీ.. ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకూడదని సూచించారు. పులివెందులలో సొంత బాబాయిని చంపేస్తే వైసీపీ నేతలు ఎందుకు మాట్లాడరు? అని ప్రశ్నించారు. అధికారంతో సంబంధం లేకుండా తుదిశ్వాస వరకు ప్రజల కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు. తాను వ్యవస్థను బలోపేతం చేసేందుకు వచ్చానని చెప్పుకొచ్చారు. గత జగన్ ప్రభుత్వంలో ఏం చేశారో వైసీపీ నేతలను అడగాలని అన్నారు. తనను బలోపేతం చేస్తే.. మరింతగా పనిచేస్తానని తెలిపారు. కూటమిలో నేతల మధ్య సమన్వయం ఉందని స్పష్టం చేశారు. తనకు, సీఎం చంద్రబాబుకు ఎలాంటి భేదాభావం లేదని పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు.


నాపై కేసులు పెట్టారు..

జగన్ హయాంలో తనపై కేసులు పెట్టారని పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు చాలా ప్రజాస్వామ్యయుత వ్యక్తి అని.. ఏం చెప్పినా నియంత్రణ పాటిద్దాం.. అంటారన్నారు. ఒక్కోసారి వైసీపీపై గట్టిగా పోరాడాల్సిన అవసరం అనిపిస్తుందని తెలిపారు. మరీ మెత్తగా ఉంటే నెత్తి మీద ఎక్కి డ్యాన్స్ వేస్తున్నారని మండిపడ్డారు. కష్టపడి పని చేస్తున్న సీఎంపై, తనపై రాళ్లు వేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలు అప్రమత్తంగా ఉండకపోతే మళ్లీ రాష్ట్రంలో నియంతృత్వ పోకడలు వస్తాయని విమర్శించారు. మార్చి 14వ తేదీన పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ నిర్వహిస్తామని చెప్పుకొచ్చారు. పిఠాపురం జనసేన ఐడియాలాజికల్ హెడ్ క్వార్టర్ అని తెలిపారు. తనకు యుద్ధకళలు అంటే ఇష్టమని అన్నారు. అందుకే పిఠాపురంలో త్వరలో తన ట్రస్ట్ పేరుతో మార్షల్.. ఫైన్ ఆర్ట్స్ అకాడమీ స్థాపిస్తానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ఆ ప్రాజెక్ట్‌ని.. జగన్ హయాంలోనే అటకెక్కించారు..

ఆరోగ్యాంధ్రప్రదేశ్ నిర్మాణంలో అంతా భాగస్వామ్యం కావాలి..

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 09 , 2026 | 03:25 PM