Share News

MP Kesineni Shivnath: ఆ ప్రాజెక్ట్‌ను.. జగన్ హయాంలోనే అటకెక్కించారు..

ABN , Publish Date - Jan 09 , 2026 | 12:54 PM

చరిత్రలో అత్యంత హీనమైన ఓటమి జగన్‌‌‌దేనని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఎద్దేవా చేశారు. వైసీపీ చరిత్ర అయిపోయిందని విమర్శించారు. మరో 25ఏళ్లు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

MP Kesineni Shivnath: ఆ ప్రాజెక్ట్‌ను.. జగన్ హయాంలోనే  అటకెక్కించారు..
MP Kesineni Shivnath

విజయవాడ, జనవరి9 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) (MP Kesineni Shivnath) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్ చెప్పేవన్నీ అబద్ధాలని ధ్వజమెత్తారు. ప్రజలు జగన్ చెప్పే అబద్ధపు మాటలు నమ్మరని అన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో రూ.925 కోట్లు జగన్ అనుయాయులకు కట్టబెట్టారని ఆరోపణలు చేశారు. ఏపీ రాజధానిని విజయవాడ, గుంటూరు మధ్యలో కట్టాలని జగన్ చెబుతున్నారని చెప్పుకొచ్చారు. రాజధాని విజయవాడకి గుంటూరుకి సమీపంలోనే ఉందని ఆయన అన్నారు.


సాక్షి పేపర్ రాసేవన్నీ అబద్ధాలే..

ఏపీ ప్రజలు ఎల్లప్పుడూ బాధపడాలని వైఎస్ జగన్ కోరుకుంటున్నారని కేశినేని శివనాథ్ ఫైర్ అయ్యారు. సాక్షి పేపర్ రాసేవన్నీ అబద్ధాలు, అర్ధ సత్యాలని విమర్శించారు. మంగళగిరి, విజయవాడ, గుంటూరులను కలిపి మహా నగరం నిర్మించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారని తెలిపారు. మూడు మహా నగరాలు కట్టిన చరిత్ర చంద్రబాబుదేనని ప్రశంసించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును అటకెక్కించింది జగన్ ప్రభుత్వమేనని విమర్శించారు. బోగాపురం ఎయిర్‌పోర్ట్ నిర్మించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని శివనాథ్ స్పష్టం చేశారు.


వైసీపీ చరిత్ర అయిపోయింది..

చరిత్రలో అత్యంత హీనమైన ఓటమి జగన్‌‌‌దేనని కేశినేని శివనాథ్ ఎద్దేవా చేశారు. వైసీపీ చరిత్ర అయిపోయిందని విమర్శించారు. మరో 25ఏళ్లు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. అప్పటి వరకు చంద్రబాబు ఉంటారా అని జగన్ అనడం సిగ్గుచేటని విమర్శించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యుత్ ఛార్జీలు తగ్గించారని తెలిపారు. అమరావతి, విశాఖపట్నం, రాయలసీమలను కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

కంచికచర్ల తహసీల్దార్ కార్యాలయంలో అగ్నిప్రమాదం..

ఆరోగ్యాంధ్రప్రదేశ్ నిర్మాణంలో అంతా భాగస్వామ్యం కావాలి..

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 09 , 2026 | 04:20 PM