Share News

జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మాక్వానాకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

ABN , Publish Date - Mar 07 , 2026 | 01:59 PM

జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మాక్వానా రాజమండ్రిలో శనివారం విసృత్తంగా పర్యటించారు. ఈపర్యటనలో కిషోర్ మాక్వానా.. స్వల్ప అస్వస్థతకు గురికావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మాక్వానాకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
Kishor Makwana Health Issue

రాజమండ్రి, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మాక్వానా (Kishor Makwana) ఈరోజు(శనివారం) రాజమండ్రిలో విసృత్తంగా పర్యటించారు. ఈ పర్యటనలో కిషోర్ మాక్వానా.. స్వల్ప అస్వస్థతకు గురికావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రాజమండ్రిలోని ఓఎన్జీసీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, ఓఎన్జీసీ అధికారులతో కలిసి ఆయన పాల్గొన్నారు. సమావేశం జరుగుతున్న సమయంలోనే కిషోర్ మాక్వానా అస్వస్థతకు గురయ్యారు.


ఈ సమావేశంలో ఉండగానే ఆయనకు వాంతులు కావడంతో వెంటనే అధికారులు స్పందించి సమీపంలోని డెల్టా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించగా ప్రస్తుతం ఆయన ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతున్నట్లు సమాచారం. అధికారులు వెంటనే స్పందించడంతో ఎలాంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో కిషోర్ మాక్వానా చికిత్స పొందుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎవరో ఇచ్చేది కాదు: సీఎం చంద్రబాబు

జగన్ అండ్ కో కుట్రలను ఎదుర్కోవాలంటే మనం కలిసి ఉండాలి: పవన్ కల్యాణ్

Read Latest International News And Telangana News And AP News And Telugu News

Updated Date - Mar 07 , 2026 | 02:06 PM