తూర్పుగోదావరి జిల్లాలో 22న జాబ్‌మేళా నిర్వహిస్తున్నాం: గోరంట్ల బుచ్చయ్య
ABN , Publish Date - Jul 16 , 2026 | 11:44 AM
తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్‌లో ఈనెల 22వ తేదీన జాబ్‌మేళా నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రకటించారు.
రాజమండ్రి, జులై 16 (ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్‌లో ఈనెల 22వ తేదీన జాబ్‌మేళా నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి (MLA Gorantla Butchaiah Chowdary) ప్రకటించారు. ఈ జాబ్‌మేళాలో 14 ప్రముఖ కంపెనీలు పాల్లొని యువతకు ఉద్యోగాలు కల్పిస్తారని పేర్కొన్నారు. ఈరోజు(గురువారం) రాజమండ్రిలో ఎమ్మెల్యే గోరంట్ల మీడియాతో మాట్లాడారు. గోదావరి పుష్కరాల కోసం రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో రోడ్లను అభివృద్ధి చేస్తామని తెలిపారు.
మురుగు నీరు గోదావరిలో కలువకుండా 50 ఎంఎల్‌డీ ప్లాంట్‌లను అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పుకొచ్చారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు ఇస్తామని వెల్లడించారు. మోరంపూడిలో సర్వీస్ రోడ్లను వేయిస్తామని తెలిపారు. క్రికెట్ స్టేడియం కోసం భూములు సేకరిస్తున్నామని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
జగన్ రెడ్డిది రాక్షస మనస్తత్వం.. మంత్రి నిమ్మల ధ్వజం
తుది దశకు అహ్మదాబాద్ విమాన ప్రమాద దర్యాప్తు: కేంద్రమంత్రి
Read Latest AP News And Telangana News And National News
And Telugu News