ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య.. నిందితుడు షేక్ సాదిక్ ఖాన్‌పై కేసు
ABN , Publish Date - Aug 18 , 2026 | 11:09 AM
పిఠాపురం మండలంలో పంచాయతీ రాజ్ శాఖ ఏఈగా పనిచేస్తున్న నూకరాజు తన కుటుంబంతో సహా గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడు కాకినాడకు చెందిన ప్రో రైఫిల్ షూటింగ్ నిర్వాహకుడు షేక్ సాదిక్ ఖాన్‌పై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
కాకినాడ, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): పిఠాపురం మండలంలో పంచాయతీ రాజ్ శాఖ ఏఈగా పనిచేస్తున్న నూకరాజు తన కుటుంబంతో సహా గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడు కాకినాడకు చెందిన ప్రో రైఫిల్ షూటింగ్ నిర్వాహకుడు షేక్ సాదిక్ ఖాన్‌పై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కాకినాడ సర్పవరం పోలీసు స్టేషన్‌లో 103(1), 306(50), 127(1), 351 (3), 108, 299 BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మృతుడు నూకరాజు వియ్యంకుడు భాస్కర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. జులై 2వ తేదీన తన కుమారుడు జగదీశ్వర్‌రెడ్డికి షేక్ సాదిక్ ఖాన్ నూకరాజు కూతురు ఇంటికి వస్తూ వారి ఆస్తి వివరాలు సేకరించాడని ఫిర్యాదులో భాస్కర్‌రెడ్డి ప్రస్తావించారు.
తన భర్తను సాదిక్ ఖాన్ చంపినట్లుగా నూకరాజు కూతురు, తన కోడలు సౌజన్య చనిపోయే ముందు లేఖలో రాశారని భాస్కర్‌రెడ్డి ప్రస్తావించారు. సాదిక్ ఖాన్ తన కోడలు సౌజన్యను ఏదో ప్రైవేట్ విషయాలను అడ్డుపెట్టుకుని బ్లాక్ మెయిల్, టార్చర్ చేశాడని అన్నారు. ఆమె ఫోన్ ట్రాప్ చేస్తూ ఆస్తి కోసం బెదిరించేవాడని ఫిర్యాదులో వివరించారు. సాజన్యను ముస్లిం మత ఆచారాలను పాటించాలని, ఇస్లాం బుక్ చదివి, ఇస్లాంలోకి మారాలని, వాటిని రోజు రాయించే వాడని, గత్యంతరం లేని పరిస్థితుల్లో సాదిక్ చెప్పినట్లుగా సౌజన్య చేసిందని భాస్కర్‌రెడ్డి తెలిపారు.
సాజన్యను లోబర్చుకుని తన ఇంటిని, తన భర్త ఫోన్, ఎస్‌బీఐ లాకర్, ఆస్తి డాంక్యుమెంట్స్ అన్ని తీసుకున్నట్లు లేఖలో సౌజన్య రాశారని నూకరాజు వియ్యంకుడు భాస్కరరెడ్డి చెప్పారు. గత్యంతరం లేకే సౌజన్యతో కలిసి నూకరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకుందని ఫిర్యాదులో వివరించారు. ఇటీవల మరణించిన తన కొడుకు జగదీశ్వరరెడ్డి మృతిపై తనకు అనుమానాలు ఉన్నాయని, దీనిపై దర్యాప్తు చేయాలని నూకరాజు వియ్యంకుడు భాస్కర్‌రెడ్డి కోరారు.
వార్తలు కూడా చదవండి...
నా రాజకీయ జీవితంలో గ్రూప్ -1 లాంటి స్కాం చూడలేదు: సీఎం
అసెంబ్లీలో మంత్రుల సరదా సంభాషణ.. సత్యకుమార్‌పై లోకేశ్ చమత్కారం
ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్‌పర్సన్‌గా నాగబాబు.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
Read Latest AP News And Telangana News And National News
And Telugu News