Share News

తుని చిన్నారి అదృశ్యం కేసులో కీలక పరిణామం.. పెంపుడు కుక్క మృతి

ABN , Publish Date - Jun 13 , 2026 | 03:32 PM

తుని చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో కీలకంగా భావిస్తున్న పెంపుడు కుక్క అనుమానాస్పదంగా మృతి చెందింది. ఈ ఘటనతో కేసు దర్యాప్తులో కొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

తుని చిన్నారి అదృశ్యం కేసులో కీలక పరిణామం.. పెంపుడు కుక్క మృతి
Kakinada Child Missing case

కాకినాడ, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): తుని చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో కీలకంగా భావిస్తున్న పెంపుడు కుక్క అనుమానాస్పదంగా మృతిచెందింది. ఈ ఘటనతో కేసు దర్యాప్తులో కొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 6వ తేదీన చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమైన సమయంలో ఆమె వెంట వెళ్లిన పెంపుడు కుక్క కూడా కొంతకాలం కనిపించకుండా పోయింది. మూడు రోజుల తర్వాత కుక్క తిరిగి ఇంటికి వచ్చింది. ఆ తర్వాత నుంచి అది విచిత్రంగా ప్రవర్తించడంతో కుటుంబ సభ్యులు, పోలీసులు దాన్ని పర్యవేక్షణలో ఉంచారు.


ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు ఆ కుక్కకు జీపీఎస్ ట్రాకర్ అమర్చారు. దాని కదలికలను నిన్న ప్రత్యేకంగా పరిశీలించారు. చిన్నారి అదృశ్యం కేసులో ఆ కుక్క కీలక ఆధారాలు ఇవ్వవచ్చని భావించారు. ఈ నేపథ్యంలో డాగ్ ప్రవర్తనపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. అయితే, గత రెండు రోజులుగా కుక్క ఆరోగ్యం క్షీణించడంతో వెటర్నరీ వైద్యులు చికిత్స అందించారు. నిన్న రాత్రి కుక్కకు ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత, ఈరోజు ఉదయం అనారోగ్యంతో మృతిచెందింది. ఈ అనూహ్య ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


చిన్నారి అదృశ్యం కేసులో పెంపుడు కుక్క మృతి కారణంగా కీలక ఆధారం కోల్పోయినట్లయింది. ఇప్పటివరకు ఆ కుక్క కదలికల ద్వారా కొంత సమాచారం లభించవచ్చని పోలీసులు ఆశించారు. చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. చిన్నారిని ఎవరైనా అపహరించారా అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. కుటుంబ సభ్యులు, స్థానికులు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఈ కేసును అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. ఈ ఘటనతో తుని, కాకినాడ ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది.


ఈ వార్తలు కూడా చదవండి...

ఏఐ లెర్నింగ్, క్వాంటం టెక్నాలజీతో విద్యార్థులకు భవిష్యత్తు నైపుణ్యాలు: సీఎం చంద్రబాబు

డీఎస్సీపై అపోహలు వద్దు.. అక్టోబర్‌లో మరో నోటిఫికేషన్: ఏపీ విద్యాశాఖ

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jun 13 , 2026 | 03:42 PM