అమలాపురంలో ఉద్రిక్తత.. చలాన్ల వివాదంతో టీడీపీ, వైసీపీ నేతల మధ్య తోపులాట
ABN , Publish Date - Oct 19 , 2026 | 03:22 PM
అమలాపురం మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ల స్క్రుటినీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. చలాన్ల పెండింగ్ పేరుతో మున్సిపల్ కార్యాలయంలో టీడీపీ నేతలపై వైసీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు.
కోనసీమ, అక్టోబర్ 19: అమలాపురం మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ల స్క్రుటినీ సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. చలాన్ల పెండింగ్ పేరుతో మున్సిపల్ కార్యాలయంలో టీడీపీ నేతలపై వైసీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. దీంతో అక్కడ తోపులాట జరిగింది. 15వ వార్డు నామినేషన్ల పరిశీలనలో టీడీపీ-వైసీపీ నాయకుల మధ్య తీవ్ర గందరగోళం నెలకొంది. బైక్ చలాన్ రూ.1000 పెండింగ్ ఉందంటూ టీడీపీ అభ్యర్థి నామినేషన్‌ను రద్దు చేయాలని వైసీపీ అభ్యర్థి చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. మున్సిపాలిటీకి రూ. 61 వేలు బకాయి ఉన్న వైసీపీ అభ్యర్థి చంద్రశేఖర్ నామినేషన్ రిజెక్ట్ చేయాలని టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ గందరగోళం నెలకొంది.
అయితే మున్సిపాలిటీకి తప్ప బయటి చలాన్లతో సంబంధం లేదని మున్సిపల్ సిబ్బంది తేల్చిచెప్పారు. అయినప్పటికీ నామినేషన్ కేంద్రంలో ఒకరిపై ఒకరు కేకలు, అరుపులతో ఇరుపార్టీ నేతలు రెచ్చిపోయారు. టీడీపీ నాయకులపై వైసీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో మున్సిపల్ ఆఫీసులో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపుచేసేందుకు యత్నించారు.
ఇవి కూడా చదవండి...
ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయం వద్ద శిల్పా చక్రపాణి రెడ్డి హల్‌చల్
‘హింస అనేది వాళ్ల డీఎన్‌ఏలోనే ఉంది’.. వైసీపీపై సీఎం చంద్రబాబు ఆగ్రహం
Read Latest AP News And Telugu News