ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయం వద్ద శిల్పా చక్రపాణి రెడ్డి హల్‌చల్
ABN , Publish Date - Oct 19 , 2026 | 01:43 PM
నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి హల్‌చల్ చేశారు. వైసీపీ చైర్మన్ అభ్యర్థికి చెందిన క్యాస్ట్ సర్టిఫికెట్‌ను చించివేశారంటూ ఆందోళనకు దిగారు.
నంద్యాల, అక్టోబర్ 19: జిల్లాలోని ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి హల్‌చల్ చేశారు. వైసీపీ చైర్మన్ అభ్యర్థికి చెందిన క్యాస్ట్ సర్టిఫికెట్‌ను చించివేశారంటూ ఆందోళనకు దిగారు. తన అనుచరులతో కలిసి మున్సిపల్ ఆఫీసు వద్ద శిల్పా చక్రపాణి వీరంగం సృష్టించారు. వెంటనే రంగంలోకి దిగిన డీఎస్పీ రామాంజి నాయక్.. వైసీపీ నేతలకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ‘మీవాళ్లు రండి నేను మాట్లాడిస్తాను’ అని డీఎస్పీ చెప్పినా వినకకుండా వైసీపీ నేతలు రెచ్చిపోయారు. దీంతో శాంతిభద్రతలకు విఘాతం వస్తుందని.. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ సమస్యను కలెక్టర్, ఎమ్మెల్యే దృష్టికి మాజీ ఎమ్మెల్యే తీసుకెళ్లగా.. సమస్యను పరిష్కరిస్తామని అధికారులు తెలిపారు.
ఎంపీ శబరి ఆందోళన
మరోవైపు నంద్యాల మున్సిపల్ ఆఫీసు వద్ద ఎంపీ బైరెడ్డి శబరి ఆందోళనకు దిగారు. గొడవలు చేసేందుకు వచ్చిన వైసీపీ నాయకులను బయటకు పంపించాలంటూ గేటు వద్ద బైఠాయించి మరీ ఎంపీ నిరసన తెలిపారు.
ఇవి కూడా చదవండి...
మైదుకూరు మున్సిపల్ ఎన్నిక వాయిదా వేస్తున్నాం: ఎస్‌ఈసీ
రాయచోటిలో 44 వార్డులు ఏకగ్రీవం.. చరిత్రాత్మక విజయమన్న మంత్రి మండిపల్లి
Read Latest AP News And Telugu News