Share News

‘నవంబర్‌లోగా కాఫర్ డ్యాం నిర్మించాలి’.. కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద కవిత డిమాండ్

ABN , Publish Date - Oct 19 , 2026 | 01:26 PM

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కన్నెపల్లి లక్ష్మీ పంపుహౌస్‌ను టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కవిత సందర్శించారు. కన్నెపల్లి పంప్ హౌజ్ వ్యూ పాయింట్ నుంచి గోదావరి‌ ప్రవాహన్ని పరిశీలించారు.

‘నవంబర్‌లోగా కాఫర్ డ్యాం నిర్మించాలి’.. కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద కవిత డిమాండ్
Kalvakuntla Kavitha

జయశంకర్ భూపాలపల్లి, అక్టోబర్ 19: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కన్నెపల్లి లక్ష్మీ పంపుహౌస్‌ను టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కవిత సందర్శించారు. కన్నెపల్లి పంప్ హౌజ్ వ్యూ పాయింట్ నుంచి గోదావరి‌ ప్రవాహన్ని పరిశీలించారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో నెలకొన్న నీటి సమస్యను పరిశీలించేందుకు కవిత పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ చీఫ్ మాట్లాడుతూ.. ప్రాణహిత నీటిని మళ్లించేందుకు కాఫర్ డ్యాం నిర్మించాలని డిమాండ్ చేశారు. నవంబర్ నెలాఖరులోగా కాఫర్ డ్యాంను నిర్మించకుంటే కన్నెపల్లి పంపు హౌస్ వద్ద ఆందోళన చేస్తామని హెచ్చరించారు.


మేడిగడ్డను బూచీగా చూపి రైతులకు నష్టం చేయవద్దని కవిత అన్నారు. ప్రశ్నించి, పోరాడటమే కాకుండా ప్రభుత్వానికి పరిష్కార మార్గాలను చెబుతున్నామన్నారు. ప్రజల సమస్యలు పరిష్కారం కావాలన్న చిత్తశుద్ధితో తాము ఇక్కడ వరకు వచ్చామని తెలిపారు. ఏదో రాజకీయాలు చేస్తూ టీవీల్లో కనిపించాలనే ఉద్దేశం ఉన్న పార్టీ టీఆర్‌ఎస్ కాదని.. తాము చేసిన సూచనలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని రైతులకు మేలు చేయాలని కవిత డిమాండ్ చేశారు.


ఇవి కూడా చదవండి...

దసరా వచ్చిందయ్యా.. సంబరం తెచ్చిందయ్యా.

హైదరాబాద్‌లో విషాదం.. షేర్ మార్కెట్ నష్టాలతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 19 , 2026 | 01:32 PM