మైదుకూరు మున్సిపల్ ఎన్నిక వాయిదా వేస్తున్నాం: ఎస్‌ఈసీ
ABN , Publish Date - Oct 19 , 2026 | 12:45 PM
వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరులో మున్సిపల్ ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ప్రకటించారు.
అమరావతి, అక్టోబర్ 19: వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరులో మున్సిపల్ ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ప్రకటించారు. ఈరోజు(సోమవారం) మీడియాతో మాట్లాడుతూ.. మైదుకూరులో ఎన్నికలను నిర్వహించేందుకు త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. నామినేషన్ పత్రాలు చించివేసినందున వాటి పరిశీలన కష్టమని అన్నారు. జిల్లా కలెక్టర్ నుంచి అందిన నివేదిక ఆధారంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ఈరోజు సాయంత్రం కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు ఎస్‌ఈసీ వెల్లడించారు.
భారీగా నామినేషన్లు..
రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలైనట్లు ఎస్‌ఈసీ తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్లలో మేయర్ స్థానాలకు 320 నామినేషన్లు వచ్చాయన్నారు. వార్డు సభ్యుల స్థానాలకు 8,190 నామినేషన్లు వచ్చాయని వెల్లడించారు. అలాగే 87 మున్సిపాలిటీల్లో చైర్మన్ పదవులకు 1,358 నామినేషన్లు, వార్డు సభ్యుల స్థానాలకు 24,451 నామినేషన్లు అందినట్లు ఎస్‌ఈసీ అనిల్ చంద్ర పునేఠా పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
రూ.256.75 కోట్ల పనుల బిల్లుల అప్‌లోడ్‌లో నిర్లక్ష్యం.. గోదావరి డెల్టా సీఈకి మెమో
ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
Read Latest AP News And Telugu News