ఏఈ నూకరాజు కేసు.. కేరళ మీదుగా విదేశాలకు పారిపోయేందుకు సాధిక్ ప్లాన్?
ABN , Publish Date - Aug 23 , 2026 | 08:12 AM
కాకినాడ జిల్లా పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ టిల్లపూడి నూకరాజు కుటుంబం ఈ నెల 16వ తేదీన అర్ధరాత్రి రాజమహేంద్రవరంలోని గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ కేసులో కాకినాడకు చెందిన రైఫిల్ షూటింగ్ శిక్షకుడు సాధిక్ ఖాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాకినాడ, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ టిల్లపూడి నూకరాజు కుటుంబం ఈ నెల 16వ తేదీన అర్ధరాత్రి రాజమహేంద్రవరంలోని గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ కేసులో కాకినాడకు చెందిన రైఫిల్ షూటింగ్ శిక్షకుడు సాధిక్ ఖాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు(ఆదివారం) కాకినాడకు అతడిని తీసుకువచ్చి పోలీసులు విచారించనున్నారు. నిన్న (శనివారం) యూపీలోని మేరఠ్ న్యాయస్థానంలో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ తీసుకోవడంలో కొంత జాప్యం ఏర్పడింది.
అనంతరం శనివారం రాత్రి వారెంట్‌తో సాధిక్‌ని తీసుకుని కాకినాడకు పోలీసులు బయలుదేరారు. ఇప్పటివరకు 5 రోజుల్లో 4 రాష్ట్రాల్లో సాధిక్ మకాం వేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. అతడు ఫోన్, డిజిటల్ లావాదేవీల కోసం వినియోగించలేదని పోలీసులు తెలిపారు. ఇంకొక్కరోజు గడిస్తే కేరళ వెళ్లి అక్కడి నుంచి సముద్ర మార్గంలో విదేశాలకు పారిపోవడానికి ప్లాన్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.
నూకరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఈ నెల16వ తేదీ రాత్రి 12 గంటలకు.. సాధిక్ సామర్ల కోట రైల్వేస్టేషన్‌కు వచ్చి జనరల్ టికెట్ తీసుకుని కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ఎక్కాడు. మార్గమధ్యలో తన సెల్‌ఫోన్ పోయిందని, ఇంట్లో వారితో మాట్లాడాలంటూ ఓ వ్యక్తి నుంచి ఫోన్ తీసుకుని కాకినాడలోని ఓ న్యాయవాదికి, సోదరికి కాల్ చేసి మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇవాళ సాధిక్‌ను విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
వార్తలు కూడా చదవండి...
ఉద్యోగాలు, ప్రతిభకు దేశంలోనే నంబర్‌వన్ సిటీగా విశాఖ: సీఎం చంద్రబాబు
పవన్ కల్యాణ్ దిశానిర్దేశం.. శరవేగంగా అడవుల పునరుద్ధరణ కార్యక్రమం
ఈ ఏడాది మరో 3వేల టీచర్ పోస్టుల భర్తీ: మంత్రి లోకేశ్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News