ప్చ్.. టమోటా.. ధరల తగ్గుముఖం
ABN , Publish Date - Jun 18 , 2026 | 01:49 PM
టమోటా ధరలు తగ్గుముఖం పడుతుండటంతో రైతులు నిరాశ చెందుతున్నారు.
రైతుల్లో నిరాశ
రామకుప్పం(చిత్తూరు): టమోటా ధరలు తగ్గుముఖం పడుతుండటంతో రైతులు నిరాశ చెందుతున్నారు. వారం రోజుల క్రితం జిల్లాలోని రామకుప్పం, వి.కోట, ఏడోబైలు, పలమనేరు మార్కెట్లలో నాణ్యత గల టమోటా (15కిలోల బాక్సు) ధర రూ.600, మధ్యస్తంగా ఉన్న టమోటా రూ.350- రూ.400 వరకు, చిన్నసైజు రూ.250- రూ.300 వరకు పలికింది. వారం రోజులుగా మార్కెట్లకు టమోటాలు భారీగా వస్తున్నాయి. మరోపక్క తమిళనాడు నుంచీ ఇక్కడకు వస్తున్నాయి. దీంతో టమోటాకు గిరాకీ తగ్గడంతో నాలుగైదు రోజులుగా ధరలు తగ్గుముఖం పడుతున్నాయి.
బుధవారం అత్యంత నాణ్యత గల టమోటా బాక్సు ధర రూ.400, మధ్యస్త బాక్సు ధర రూ.250- రూ.300 వరకు, చిన్నసైజు టమోటాల బాక్సు రూ.120- రూ.150 వరకు పలికింది. ఇటీవల వర్షాలతో తోటలకు చీడపీడలు ఆశించాయి. పంటను కాపాడుకునేందుకు భారీ వ్యయంతో సస్యరక్షణ మందులు వినియోగిస్తున్నారు. పెట్టుబడి వ్యయం భారీగా పెరిగింది. ఈ పరిస్థితుల్లో ధరలు తగ్గుముఖం పడుతుండటం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
అనగనగా ఓ దేవర దున్నపోతు.. ఏం జరిగిందంటే..
Read Latest AP News And Telangana News And International News And Telugu News