తుని చిన్నారి మిస్సింగ్ కేసు.. డిప్యూటీ సీఎం ఆదేశాలతో రంగంలోకి ప్రత్యేక బృందాలు
ABN , Publish Date - Jun 18 , 2026 | 12:37 PM
కాకినాడ జిల్లా తునిలో చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రోజులు గడుస్తున్నా చిన్నారి జాడ లభించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాకినాడ, జూన్ 18: తునిలో చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రోజులు గడుస్తున్నా చిన్నారి జాడ లభించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారి ఆచూకీ కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు అటవీ శాఖ, ప్రత్యేక హనుమాన్ టీమ్ సంయుక్తంగా థర్మల్ డ్రోన్ల సహాయంతో సెర్చింగ్ ఆపరేషన్‌ను నిర్వహిస్తున్నాయి. రాత్రి వేళల్లోనూ పాప కోసం విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. థర్మల్ డ్రోన్ల ద్వారా అటవీ జంతువుల కదలికలపైనా అధికారులు నిఘా పెట్టారు.
చిన్నారిని అడవి జంతువులు ఎత్తుకెళ్లి ఉండవచ్చన్న అనుమానంతో.. ఆ కోణంలోనూ గాలింపు కొనసాగుతోంది. అటవీ ప్రాంతాల్లో జంతువుల కదలికలను గుర్తించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. చిన్నారి జాడను కనిపెట్టడం కోసం పోలీసులు ఇప్పటికే రెండు బొమ్మలను వేలాడదీసి, వాటిలో మాంసం ఎరగా ఉంచారు. ఇప్పటివరకు ఎలాంటి జంతువుల జాడ కానరాకపోవడం గమనార్హం. చిన్నారి ఆచూకీ కోసం అన్ని కోణాల్లోనూ దర్యాప్తు కొనసాగుతోంది. పాప క్షేమంగా తిరిగి రావాలని తల్లిదండ్రులతో పాటు స్థానిక ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
రౌడీషీటర్ సాయికృష్ణ అదృశ్యం మిస్టరీ.. రంగంలోకి రాజమండ్రి ఎస్పీ
కోస్తాతీర ప్రాంతాల్లో గ్రీన్ బెల్ట్ అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష
Read Latest AP News And Telugu News