కోస్తాతీర ప్రాంతాల్లో గ్రీన్ బెల్ట్ అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష
ABN , Publish Date - Jun 18 , 2026 | 11:52 AM
కోస్తాతీర ప్రాంతాల్లో గ్రీన్ బెల్ట్ అభివృద్ధిపై ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించారు. గురువారం నాడు ఏపీ సచివాలయంలో సామాజిక అడవుల పెంపకానికి తీసుకోవాల్సిన చర్యలపై అటవీ శాఖ అధికారులతో పవన్ సమావేశమయ్యారు.
అమరావతి, జూన్ 18: కోస్తా ప్రాంతాల్లో హరితాభివృద్ధి, పర్యావరణ సమతుల్యతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కోస్తాతీర ప్రాంతాల్లో గ్రీన్ బెల్ట్ అభివృద్ధిపై ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించారు. గురువారం నాడు ఏపీ సచివాలయంలో సామాజిక అడవుల పెంపకానికి తీసుకోవాల్సిన చర్యలపై అటవీ శాఖ అధికారులతో పవన్ సమావేశమయ్యారు. తీర ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణ, హరిత వలయాల విస్తరణపై చర్చించారు. గ్రీన్ బెల్ట్ అభివృద్ధికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచనలు చేశారు.
సోషల్ ఫారెస్ట్రీ కార్యక్రమాలను గ్రామీణ ప్రాంతాల్లో మరింత విస్తరించే దిశగా సమావేశంలో చర్చించారు. అటవీ సంపద పెంపు, తీర ప్రాంతాల్లో వృక్ష సంపద అభివృద్ధిపై సమీక్షించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం పెంచే చర్యలపై అధికారులతో పవన్ కల్యాణ్ చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ కార్యదర్శి వి.వినయ్ చంద్, పీసీసీఎఫ్ పి.వి.చలపతిరావు, సీసీఎఫ్ బీఎన్నెం మూర్తి, సీసీఎఫ్ ఎన్.నాగేశ్వరరావు హాజరయ్యారు. అలాగే అటవీశాఖ సలహాదారు పి.మల్లికార్జునరావు, ఇతర ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి...
మరోసారి బుల్లెట్‌పై ఎమ్మెల్యే దగ్గుపాటి.. తెల్లవారుజామున ఆకస్మిక తనిఖీలు
రౌడీషీటర్ సాయికృష్ణ అదృశ్యం మిస్టరీ.. రంగంలోకి రాజమండ్రి ఎస్పీ
Read Latest AP News And Telugu News