మరోసారి బుల్లెట్‌పై ఎమ్మెల్యే దగ్గుపాటి.. తెల్లవారుజామున ఆకస్మిక తనిఖీలు
ABN , Publish Date - Jun 18 , 2026 | 10:31 AM
అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మరోసారి బుల్లెట్ ఎక్కి నగర వీధుల్లో పర్యటించారు. గురువారం నాడు తెల్లవారుజామున 5 గంటలకే ఓల్డ్ టౌన్‌లోని 5వ మస్టర్‌ను ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు.
అనంతపురం, జూన్ 18: అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మరోసారి బుల్లెట్ ఎక్కి నగర వీధుల్లో పర్యటించారు. ఈరోజు(గురువారం) తెల్లవారుజామున 5 గంటలకే ఓల్డ్ టౌన్‌లోని 5వ మస్టర్‌ను ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎమ్మెల్యే ఆకస్మిక రాకతో అధికారులు, సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. మస్టర్‌లో సిబ్బంది హాజరు శాతం, ఎవరెవరు ఎక్కడ పని చేస్తున్నారన్నది పరిశీలించారు. అనంతరం రాంనగర్, కోవూర్ నగర్, లక్ష్మీనగర్, జనశక్తి నగర్‌లో ఎమ్మెల్యే పర్యటించారు.
ఇటీవల కురిసిన వర్షాలకు నీరు చేరిన ప్రాంతాలను ఎమ్మెల్యే పరిశీలించారు. పెద్దఎత్తున నీరు చేరడానికి కారణాలను తెలుసుకున్నారు. ఆపై అన్న క్యాంటీన్‌ను పరిశీలించారు. క్యాంటీన్‌లో శుచి, శుభ్రత ఉండాలని.. తాజా కాయగూరలే వాడాలని అక్కడి సిబ్బందికి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సూచించారు.
ఇవి కూడా చదవండి...
జననాయగన్ విడుదలపై మూవీ యూనిట్ క్లారిటీ.. రిలీజ్ ఎప్పుడంటే..
రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి
Read Latest AP News And Telugu News