Share News

ఇదేనా మీ సంస్కారం?

ABN , Publish Date - Jun 18 , 2026 | 04:52 AM

‘హోం మంత్రి అనితపై ఆ కోడిగుడ్డు మంత్రి (గుడివాడ అమర్నాథ్‌) కించపరిచే వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు చాలా బాధాకరం. అయితే చాలా బాగా మాట్లాడావంటూ జగన్‌రెడ్డి ఆయన్ను పొగిడేశారట!

ఇదేనా మీ సంస్కారం?

  • హోం మంత్రిని అనుచితంగా మాట్లాడితే పొగడ్తలా?

  • గొడ్డలి బ్యాచ్‌కు మహిళలను గౌరవించడం తెలియదు: లోకేశ్‌

‘హోం మంత్రి అనితపై ఆ కోడిగుడ్డు మంత్రి (గుడివాడ అమర్నాథ్‌) కించపరిచే వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు చాలా బాధాకరం. అయితే చాలా బాగా మాట్లాడావంటూ జగన్‌రెడ్డి ఆయన్ను పొగిడేశారట! భారతీరెడ్డి గురించి గానీ, మీ ఇద్దరు కూతుళ్ల గురించి గానీ ఇదేవిధంగా మాట్లాడితే ఇలాగే సమర్థిస్తారా? ఇదేనా మీ సంస్కారం? మహిళలకు మీరిచ్చే గౌరవం ఇదేనా? మీరు అధికారంలో ఉన్నప్పుడు నా తల్లిని, నా భార్య బ్రాహ్మణిని అవమానించారు. మేం అధికారంలోకి వచ్చాక మా కార్యకర్త ఒకరు పొరపాటున భారతీరెడ్డి గురించి తప్పుగా మాట్లాడితే.. ఏకంగా అతడిని జైలుకు పంపించాం. గొడ్డలి బ్యాచ్‌కు మహిళలను గౌరవించడం అస్సలు తెలియదు. జగన్‌లో జీ అంటే గొడ్డలేమో మరి’ అని లోకేశ్‌ వ్యంగ్యంగా అన్నారు. కోడిగుడ్డుకు, పరిశ్రమకు తేడా తెలియని వారిని జగన్‌ మంత్రులుగా చేయబట్టే పరిశ్రమలు పారిపోయాయని తెలిపారు.

మాకా అవసరం లేదు

ఈ మధ్య ఓట్లు తీసేస్తున్నామంటూ ఆరోపణలు చేస్తున్నారని.. ఎవరి ఓట్లూ తీసేయాల్సిన అవసరం తమకు లేదని లోకేశ్‌ స్పష్టం చేశారు. వైసీపీకి ఐటీలో అస్సలు అవగాహన లేనందునే ఇస్టానుసారం మాట్లాడేస్తున్నారని అన్నారు. ఒక యాప్‌ తయారు చేసి టీడీపీ కార్యకర్తల పనితీరును సులభతరం చేశామని.. ఉద్దేశపూర్వకంగానే ఆరోపణలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

Updated Date - Jun 18 , 2026 | 04:52 AM