Share News

టీఎంసీకి కోల్‌కతా హైకోర్టు షాక్.. రితబ్రత నియామకంపై స్టేకు నిరాకరణ

ABN , Publish Date - Jun 18 , 2026 | 01:13 PM

తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి కోల్‌కతా హైకోర్టు షాకిచ్చింది. ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్న రితబ్రత బెనర్జీకి వ్యతిరేకంగా దాఖలపైన పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది.

టీఎంసీకి కోల్‌కతా హైకోర్టు షాక్.. రితబ్రత నియామకంపై స్టేకు నిరాకరణ
Kolkata HC refuses to stay Rebel TMC MLA Ritabrata Banerjees Appointment

ఇంటర్నెట్ డెస్క్: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా తిరుగుబాటుచేసిన ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీ నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై కోల్‌కతా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చేందుకు నిరాకరించింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ కృష్ణారావు నేతృత్వంలోని ధర్మాసనం.. తదుపరి విచారణ జరిపేంత వరకు స్పీకర్ నిర్ణయం అమలులో ఉంటుందని స్పష్టం చేసింది.


ఈ పిటిషన్ తదుపరి విచారణకు ముందే అఫిడవిట్ల మార్పిడిని పూర్తి చేయాలని ఇరు పక్షాలను ఆదేశించింది న్యాయస్థానం. ప్రతివాదులు మూడు వారాల్లోగా తమ వ్యతిరేక అఫిడవిట్‌ను దాఖలు చేయాలని, దానిపై మరో పక్షం వారు రెండు వారాల్లోగా స్పందించాలని గడువు విధించింది. ఈ విషయంపై తదుపరి విచారణ జులై 28కి వాయిదా వేసింది. దీంతో ఈ కేసు ఫలితం వెలువడే వరకు రితబ్రత బెనర్జీ గుర్తింపు పొందిన ప్రతిపక్ష నేతగా కొనసాగనున్నారు.


కాగా.. టీఎంసీ నుంచి బహిష్కృమైన రితబ్రత బెనర్జీ.. ఆ పార్టీకి వ్యతిరేకంగా తిరుగుబాటు ఎమ్మెల్యేలకు న్యాయకత్వం వహిస్తున్నారు. దీంతో బెంగాల్ రాజకీయ సంక్షోభంలో వివాదం రాజుకుంది. తమకు 58 మంది టీఎంసీ ఎమ్మెల్యేల మద్దతుందని పేర్కొంటూ, ఆమె మేనల్లుడైన అభిషేక్ బెనర్జీకి వ్యతిరేకంగా ఓ చీలిక వర్గాన్ని ఏర్పాటు చేశారు రితబ్రత. అయితే.. తిరుగుబాటు వర్గం వాదనను అంగీకరిస్తూ రితబ్రతను ప్రతిపక్ష నాయకుడిగా ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రతీంద్ర బోస్ నియమించడంతో ఈ వివాదం మరింత ముదిరింది. స్పీకర్ నిర్ణయం అధికారికంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీని పక్కనపెట్టిందని, శాసనసభ పార్టీల గుర్తింపును నియంత్రించే రాజ్యాంగ నిబంధనల్ని ఉల్లంఘించిందని వాదిస్తూ.. దీదీ వర్గం కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.


ఇవీ చదవండి:

డీఎంకేకు మరో షాక్.! టీవీకే వైపు ఎండీఎంకే.?

బీబీ ఒకసారి ఆలోచించండి.. మీకు కావాల్సినదే దక్కింది: ట్రంప్

Updated Date - Jun 18 , 2026 | 01:16 PM