Share News

విద్యుత్‌ కొనుగోళ్లపై మాట్లాడే హక్కు వైసీపీకి లేదు

ABN , Publish Date - Apr 24 , 2026 | 11:23 AM

‘లాభాల్లోని విద్యుత్‌ శాఖను వైసీపీ ప్రభుత్వ హయాంలో విధ్వంసం చేశారు. తొమ్మిదిసార్లు విద్యుత్‌ చార్జీలను పెంచి.. ప్రజలతో కట్టించిన వైసీపీకి విద్యుత్‌ కొనుగోళ్లపై మాట్లాడే నైతిక హక్కు లేదు’ అని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ విమర్శించారు.

విద్యుత్‌ కొనుగోళ్లపై మాట్లాడే హక్కు వైసీపీకి లేదు
Minister Gottipati Ravikumar

  • మంత్రి రవికుమార్‌

తిరుపతి: ‘లాభాల్లోని విద్యుత్‌ శాఖను వైసీపీ ప్రభుత్వ హయాంలో విధ్వంసం చేశారు. తొమ్మిదిసార్లు విద్యుత్‌ చార్జీలను పెంచి.. ప్రజలతో కట్టించిన వైసీపీకి విద్యుత్‌ కొనుగోళ్లపై మాట్లాడే నైతిక హక్కు లేదు’ అని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ విమర్శించారు. ఎస్పీడీసీఎల్‌ కార్యాలయంలో గురువారం 18 మందికి కారుణ్య నియామక పత్రాలను సీఎండీ శివశంకర్‌, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావుతో కలిసి అందజేశారు.


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఇప్పటివరకు విద్యుత్‌ శాఖలో 500కుపైగా కారు ణ్య నియామకాలు చేపట్టినట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతోనే ఈ నియామకాలు వేగవంతంగా జరుగుతున్నాయని చెప్పా రు. త్వరలోనే ఏఈ స్థాయిలో శాఖాపరమైన నియామకాలు చేపడతామని స్పష్టం చేశారు. పరిశ్రమల రాకతో విద్యుత్‌ డిమాండు కూడా గణనీయంగా పెరిగిందన్నారు.


డిమాండుకు తగినట్టుగా విద్యుత్‌ శాఖ కూడా రికార్డు స్థాయి విద్యుత్‌ ఉత్పత్తి నమోదు చేస్తోందని వివరించారు. డైరెక్టర్లు కె.గురవయ్య, పి.అయూబ్‌ ఖాన్‌, కె.రామ మోహన్‌ రావు, చీఫ్‌ జనరల్‌ మేనేజర్లు జె.రమణాదేవి, ఎన్‌.శోభా వాలెంటీనా, కె.ఆదిశేషయ్య, ఎస్‌.రమణ, చీఫ్‌ విజిలెన్స్‌ ఆఫీసర్‌ కె.జనార్దన్‌ నాయుడు, జాయింట్‌ సెక్రటరీ ఎం.గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

లిక్కర్ స్కాం నిందితుల నివాసాల్లో ఈడీ ఆకస్మిక సోదాలు

తుంగభద్ర కేటాయింపులు కుదించేందుకు వీల్లేదు

Read Latest Telangana News and National News

Updated Date - Apr 24 , 2026 | 11:23 AM