రైతుపై ఎలుగుబంటి దాడి.. పరిస్థితి విషమం
ABN , Publish Date - Apr 24 , 2026 | 10:54 AM
కట్టెల కోసం అడవిలోకి వెళ్లిన రైతుపై ఎలుగుబంటి దాడి చేయడం తీవ్ర కలకలం రేపింది. ఎలుగుబంటి దాడిలో రైతు ముఖంపై బలమైన గాయాలు అయ్యాయి.
కామారెడ్డి, ఏప్రిల్ 24: జిల్లాలో ఎలుగుబంటి సంచారం తీవ్ర కలకలం రేపింది. ఓ రైతుపై ఎలుగుబంటి దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది. రెడ్డిపేట స్కూల్ తండాకు చెందిన సలావత్ మత్తు(45), అతడి భార్య.. కట్టెల కోసం అడవికి వెళ్లారు. ఈ సమయంలో ఒక్కసారిగా మత్తుపై ఎలుగుబంటి దాడి చేసింది. రైతు ముఖంపై బలమైన గాయాలు అయ్యాయి. ఎలుగుబంటిని చూసిన వెంటనే మత్తు భార్య, స్థానికులు కేకలు వేశారు.
దీంతో ఎలుగుబంటి అక్కడి నుంచి అడవిలోకి పారిపోయింది. తీవ్రంగా గాయపడిన మత్తును హుటాహుటిన కామారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మత్తు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. రైతుపై ఎలుగుబంటి దాడి చేసినట్లు స్థానిక సర్పంచ్ వెల్లడించారు. ఈ ఘటనతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
ఇవి కూడా చదవండి...
ఆర్టీసీ కార్మికులను రెచ్చగొట్టొద్దు.. మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి
ఆర్టీసీ సమ్మెను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు: బండి సంజయ్
Read Latest Telangana News And Telugu News