Share News

ఆర్టీసీ సమ్మెను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు: బండి సంజయ్

ABN , Publish Date - Apr 24 , 2026 | 10:31 AM

ఆర్టీసీ కార్మికుల సమ్మెను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. గత బీఆర్‌ఎస్ సర్కార్ చేసిన తప్పే.. కాంగ్రెస్ చేస్తోందని అన్నారు.

ఆర్టీసీ సమ్మెను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు: బండి సంజయ్
Union Minister Bandi Sanjay

కరీంనగర్, ఏప్రిల్ 24: ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య బాధాకరమని కేంద్ర మంత్రి బండి సంజయ్(Union Minister Bandi Sanjay) అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... ‘ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కార్మికుడి ఆత్మహత్య.. ఇది ప్రభుత్వ హత్య’ అంటూ వ్యాఖ్యానించారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం బెదిరిస్తోందని ఆరోపించారు. ఇంత పెద్ద సమ్మె జరిగితే.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు.


గతంలో బీఆర్‌ఎస్ సర్కార్ చేసిన తప్పే.. కాంగ్రెస్ చేస్తోందని విమర్శించారు. గత ప్రభుత్వంలో కూడా ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. కాంగ్రెస్ మేనిఫెస్టో 28వ పేజీలో ఆర్టీసీని విలీనం చేస్తామని చెప్పారని గుర్తు చేశారు. రెండు పీఆర్‌సీలు చెల్లిస్తామని హామీ ఇచ్చారంటూ కాంగ్రెస్ మేనిఫెస్టోను కేంద్ర మంత్రి చదివి వినిపించారు. ఆర్టీసీ సమస్యలపై బీజేపీ పోరాడితే.. ఓటు కాంగ్రెస్‌కు వేశారని అన్నారు.


‘మంత్రులు, ఎమ్మెల్యేల జీతాల్లో కోత విధిస్తే ఎంత వస్తుంది. ఆ డబ్బులు బఠానీలు కొనుక్కోవడానికి కూడా సరిపోవు. ఢిల్లీకి పైసల మూటలు పంపడం ఆపితే కార్మికులకు డబ్బులు ఇవ్వొచ్చు’ అంటూ సర్కార్‌కు కేంద్ర మంత్రి హితవుపలికారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు తెలంగాణ నుంచే డబ్బులు వెళ్తున్నాయని ఆరోపించారు. మేనిఫెస్టోను ప్రధాని మోదీని అడిగి తయారు చేశారా అంటూ కాంగ్రెస్‌పై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఇవి కూడా చదవండి...

శంకర్‌ గౌడ్ మృతికి సీఎం రేవంత్‌ రెడ్డిదే బాధ్యత: హరీశ్ రావు

ఆర్టీసీ కార్మికులను రెచ్చగొట్టొద్దు.. మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 24 , 2026 | 10:36 AM