లిక్కర్ స్కాం నిందితుల నివాసాల్లో ఈడీ ఆకస్మిక సోదాలు
ABN , Publish Date - Apr 24 , 2026 | 11:00 AM
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం (లిక్కర్ స్కాం) కేసులో కీలక నిందితుల నివాసాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు శుక్రవారం సోదాలు చేపట్టారు.
అమరావతి, ఏప్రిల్ 24: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం (లిక్కర్ స్కాం) కేసులో కీలక నిందితుల నివాసాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు శుక్రవారం సోదాలు చేపట్టారు. రాజ్ కసిరెడ్డి, వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి, విశ్రాంత ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, భారతీ సిమెంట్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప, వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి నివాసాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, తిరుపతిలోని వారి నివాసాలతోపాటు కార్యాలయాల్లో ఈ తనిఖీలు ఈడీ అధికారులు చేపట్టారు.
రూ. వేల కోట్ల ఈ మద్యం కుంభకోణంలో వీరంతా కీలక పాత్ర పోషించినట్లు ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) ఇప్పటికే నిర్ధారించింది. గతంలో వీరంతా అరెస్టయి.. బెయిల్‌పై బయట ఉన్నారు. ఇప్పటికే వీరిని సిట్ విచారించింది. సిట్ నివేదిక ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది. వీరి నుంచి గతంలోనే ఈడీ అధికారులు సైతం స్టేట్‌మెంట్ తీసుకున్న విషయం విదితమే. ఈ ఆకస్మిక సోదాల్లో అక్రమ ఆస్తులను గుర్తించేందుకు ఈడీ అధికారులు సమాయత్తమయ్యారు. అందుకోసం ఈ ఐదుగురి నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ ఏకకాలంలో సోదాలు చేపట్టింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దుపై నేడు కోర్టులో విచారణ
ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన ట్రావెల్స్ బస్సు.. ఒకరి మృతి, పలువురికి గాయాలు
For More AP News And Telugu News