Share News

తిరుపతిలో నవ దంపతులపై దాడి.. అసలు ఏం జరిగిందంటే..?

ABN , Publish Date - Jul 24 , 2026 | 09:19 AM

తిరుపతిలో నవదంపతులపై దాడి జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువ దంపతులపై పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యులు దాడికి పాల్పడ్డారు.

 తిరుపతిలో నవ దంపతులపై దాడి.. అసలు ఏం జరిగిందంటే..?
Tirupati Newly Married Couple Case

తిరుపతి, జులై 24 (ఆంధ్రజ్యోతి): తిరుపతిలో నవదంపతులపై దాడి జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువ దంపతులపై పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యులు దాడికి పాల్పడ్డారు. రక్షణ కోసం తిరుపతి ఎస్పీ కార్యాలయానికి వెళ్తుండగా కూతవేటు దూరంలో ఈ ఘటన జరిగింది. యువతి మెడలోని తాళిబొట్టును తెంచి యువకుడిపై పెళ్లి కుమార్తె వర్గీయులు దాడి చేశారు. భయంతో ఓ కార్యాలయంలోకి నవ దంపతులు వెళ్లారు. స్థానికుల సహాయంతో ఇరువురిని ఎస్వీ యూనివర్శిటీ పోలీసుల చెంతకు ఓ మహిళా చేర్చారు.


అన్నమయ్య జిల్లా, సుండుపల్లి మండలం, కేకల దొడ్డిపల్లికి చెందిన శివ స్నేహ, సూళ్లూరుపేట మండలం, మతిమూడి గ్రామానికి చెందిన చందులకు ఓ కోచింగ్ సెంటర్ వద్ద పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఇరువురి పరిచయం ప్రేమగా మారి ఈనెల 19వ తేదీన ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు. అయితే శివస్నేహ కనపడట్లేదని రాయచోటి పోలీస్ స్టేషన్‌లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు రాయిచోటి పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో పెళ్లి కుమారుడి తల్లి మునిలక్ష్మిని, పెద్దమ్మ అచ్చమ్మతోపాటు మేనమామ ముని చంద్రాలను రాయచోటి పోలీసులు మూడు రోజుల క్రితం తీసుకెళ్లినట్లుగా చందు చెబుతున్నాడు.


ఈ విషయమై తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయానికి తాము వెళ్తున్న క్రమంలో ఈ దాడి జరిగినట్లుగా నవ దంపతులు చెబుతున్నారు. ఎస్వీ యూనివర్శిటీ పోలీసులు నవ వధువు వద్ద స్టేట్‌మెంట్ తీసుకుని రాయిచోటి పోలీసులకు సమాచారం అందజేశారు. అనంతరం రాయచోటీ పోలీసులు నవదంపతులను రాయచోటికి తీసుకెళ్లారు.


ఈ వార్తలు కూడా చదవండి...

దేవతా విగ్రహాలపై దుశ్చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు: మంత్రి ఆనం

అమరావతికి ప్రముఖ విద్యాసంస్థలు వస్తున్నాయి: మంత్రి గొట్టిపాటి

భూమన ఆక్రమించిన భూముల స్వాధీనానికి ఏపీ ప్రభుత్వం చర్యలు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jul 24 , 2026 | 09:43 AM