ఎన్టీఆర్ బాటలోనే బాబు
ABN , Publish Date - Mar 27 , 2026 | 10:57 AM
‘పేదల ఆకలి తీర్చడమే అన్న ఎన్టీఆర్ ఆశయం. కూడు.. గూడు.. గుడ్డ నినాదంతో సంక్షేమ పథకాలను అమలు చేశారు. ఇప్పుడా పథకాలు దేశమంతా అమలవుతున్నాయి.
పేదలకు సంక్షేమ పథకాల అమలు
అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవంలో భువనేశ్వరి
చిత్తూరు: ‘పేదల ఆకలి తీర్చడమే అన్న ఎన్టీఆర్ ఆశయం. కూడు.. గూడు.. గుడ్డ నినాదంతో సంక్షేమ పథకాలను అమలు చేశారు. ఇప్పుడా పథకాలు దేశమంతా అమలవుతున్నాయి. ఆయన బాటలోనే సీఎం చంద్రబాబూ పయనిస్తున్నారు’ అని నారా భువనేశ్వరి అన్నారు. శాంతిపురంలో గురువారం ఆమె అన్న క్యాంటీన్‌ను ప్రారంభించి మాట్లాడారు. పేదల ఆర్థికాభివృద్ధికి చంద్రబాబు పీ4 పథకాన్ని తీసుకొచ్చారన్నారు.
త్వరలోనే కార్గో విమానంలో ఇక్కడి రైతులు కూరగాయలు, పండ్లు, పూలు వంటివి తీసుకెళ్లి విక్రయించే సదుపాయం రానుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు షణ్ముఖంరెడ్డి, ఏపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ పీఎస్ మునిరత్నం, పీకేఎం ఉడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు, మండల టీడీపీ అధ్యక్షుడు నందిగం ఉదయకుమార్, టీడీపీ సభ్యుడు శాంతారాం, రెస్కో చైర్మన్ ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత లేదు
గోల్డ్, సిల్వర్ రేట్స్.. నేడు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News