గోల్డ్, సిల్వర్ రేట్స్.. నేడు ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - Mar 27 , 2026 | 06:59 AM
అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో నిన్న బంగారం ధర మళ్లీ తగ్గింది. వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రస్తుతం రేట్స్ ఎలా ఉన్నాయంటే..
ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరలు, యూఎస్ ట్రెజరీ బాండ్స్‌పై అధిక రాబడి, డాలర్ బలపడటం వంటి పరిణామాలు బంగారం ధరలపై ఒత్తిడి పెంచుతున్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేడు (మార్చి 27) ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,540గా ఉంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,32,490కు చేరింది. నగరంలో కిలో వెండి రూ.2,59,900ల వద్ద కొనసాగుతోంది. విజయవాడలో కూడా ధరలు ఇదే స్థాయిలో ఉన్నాయి (Gold Silver Rates on March 27).
గురువారం పసిడి ధరలు మళ్లీ తగ్గిన విషయం తెలిసిందే. 24 క్యారెట్ల పసిడి ధరలో రూ.2,120 మేర కోత పడింది. వెండి ధర మాత్రం యథాతథంగా కొనసాగుతోంది. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రస్తుతం ఔన్స్ (31.1 గ్రాములు) 24 క్యారెట్ల పసిడి ధర 4,391 డాలర్లుగా ఉంది. ఔన్స్ వెండి ధర 67 డాలర్ల వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ అనిశ్చితులు కొనసాగుతున్న వేళ రాబోయే రోజుల్లో కూడా ధరల్లో హెచ్చుతగ్గులు తప్పవని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ప్రధాన నగరాల్లో 10 గ్రాముల పసిడి (24 క్యారెట్లు, 22 క్యారెట్లు) ధరలు ఇవీ
చెన్నై: ₹1,45,630; ₹1,33,490
ముంబై: ₹1,44,540; ₹1,32,490
న్యూఢిల్లీ: ₹1,44,690; ₹1,32,640
కోల్‌కతా: ₹1,44,540; ₹1,32,490
బెంగళూరు: ₹1,44,540; ₹1,32,490
హైదరాబాద్: ₹1,44,540; ₹1,32,490
విజయవాడ: ₹1,44,540; ₹1,32,490
కేరళ: ₹1,44,540; ₹1,32,490
పుణె: ₹1,44,540; ₹1,32,490
వడోదరా: ₹1,44,590; ₹1,32,540
అహ్మదాబాద్: ₹1,44,590; ₹1,32,540
వెండి (కిలో) ధరలు
చెన్నై: ₹2,59,900
ముంబై: ₹2,49,900
న్యూఢిల్లీ: ₹2,49,900
కోల్‌కతా: ₹2,49,900
బెంగళూరు: ₹2,50,200
హైదరాబాద్: ₹2,59,900
విజయవాడ: ₹2,59,900
కేరళ: ₹2,59,900
పుణె: ₹2,49,900
వడోదరా: ₹2,49,900
అహ్మదాబాద్: ₹2,49,900
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.
ఈ వార్తలూ చదవండి:
వచ్చే ఏడాది భారత జీడీపీ వృద్ధి 6.1 శాతమే..
15 శాతం తగ్గనున్న ఎరువుల ఉత్పత్తి