మీ కుటుంబ బాధ్యత మాది..
ABN , Publish Date - Mar 27 , 2026 | 11:30 AM
‘మీ బాధ్యత మాది. అధైర్య పడకండి’ అంటూ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఐటీడీపీ జిల్లా అధికార ప్రతినిధి రవికుమార్ కుటుంబానికి నారా భువనేశ్వరి భరోసా ఇచ్చారు.
మృతుడు రవి కుటుంబీకులకు భువనేశ్వరి హామీ
చిత్తూరు: ‘మీ బాధ్యత మాది. అధైర్య పడకండి’ అంటూ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఐటీడీపీ జిల్లా అధికార ప్రతినిధి రవికుమార్ కుటుంబానికి నారా భువనేశ్వరి భరోసా ఇచ్చారు. శాంతిపురం మండలం గుండిశెట్టిపల్లెలో రవికుమార్ ఇంటికెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈమెను చూడగానే వారంతా విలపించారు. వారిని ఓదార్చుతూ ప్రమాదం ఎలా జరిగిందని తెలుసుకున్నారు.
రవి భార్య చదువుకు తగ్గటుగా ఉద్యోగ, ఉపాధి కల్పిస్తామన్నారు. రవికుమార్ చేసిన కేబుల్ వర్క్ పనులకు బిల్లులు రాలేదని కుటుంబీకులు చెప్పగా సానుకూలంగా స్పందించారు. అంతకు ముందు రవికుమార్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత లేదు
గోల్డ్, సిల్వర్ రేట్స్.. నేడు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News