Share News

స్వల్పంగా పెరిగిన పసిడి ధర! వెండి మాత్రం..

ABN , Publish Date - Mar 27 , 2026 | 10:34 AM

బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. భారత్‌లో నేడు బంగారం ధర స్వల్పంగా పెరిగింది. వెండి ధర మాత్రం పతనమైంది.

స్వల్పంగా పెరిగిన పసిడి ధర! వెండి మాత్రం..
Gold, Silver Rates on March 27 in India

ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. భారత్‌లో నేడు (మార్చి 27) 24 క్యారెట్ల బంగారం ధర సగటున రూ.160ల మేర స్వల్ప స్థాయిలో పెరగ్గా వెండి ధర మాత్రం పతనమైంది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేడు ఉదయం 10.00 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.160 మేర పెరిగి రూ.1,44,710 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా దాదాపు ఇదే స్థాయిలో పెరిగి రూ.1,32,650కు చేరుకుంది. నగరంలో వెండి ధర మాత్రం ఏకంగా రూ.15 వేల మేర పతనమై రూ.2.45 లక్షలకు చేరింది (Gold, Silver Rates on March 27).


ఇతర నగరాల వారీగా ధరలను పరిశీలిస్తే చెన్నైలో ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,510గా ఉంది. న్యూఢిల్లీలో రూ.1,44,860గా ఉంది. ముంబై, కోల్‌కతా, బెంగళూరు నగరాల్లో రూ.1,44,710 వద్ద కొనసాగుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర చెన్నైలో రూ.1,34,300గా, న్యూఢిల్లీలో రూ.1,32,800గా ఉంది. ముంబై, కోల్‌కతా, బెంగళూరు నగరాల్లో రూ.1,32,650 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.2.45 లక్షలు పలుకుతుండగా ఇతర నగరాల్లో రూ.2.40 లక్షలుగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రస్తుతం ఔన్స్ (31.10 గ్రాములు) 24 క్యారెట్ల బంగారం స్పాట్ ధర 4,444 డాలర్ల వద్ద, ఔన్స్ వెండి ధర 69 డాలర్ల వద్ద కొనసాగుతున్నాయి.


ఈ వార్తలూ చదవండి

భారీ నష్టాల్లో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్లు..

గుడ్ న్యూస్! పెట్రోల్, డీజిల్‌పై అదనపు ఎక్సైజ్ డ్యూటీలో కోత

Updated Date - Mar 27 , 2026 | 10:43 AM