గుడ్ న్యూస్! పెట్రోల్, డీజిల్‌పై అదనపు ఎక్సైజ్ డ్యూటీలో కోత
ABN , Publish Date - Mar 27 , 2026 | 09:40 AM
కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ డీజిల్‌పై అదనపు ఎక్సైజ్ డ్యూటీలో రూ.10 మేర కోత విధించింది.
ఇంటర్నెట్ డెస్క్: పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ముడి చమురు ధరలు అంతకంతకూ పెరుగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్‌పై అదనపు ఎక్సైజ్ డ్యూటీలో రూ.10 మేర ప్రభుత్వం కోత విధించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ప్రస్తుతం పెట్రోల్‌పై రూ.13గా ఉన్న అదనపు ఎక్సైజ్ డ్యూటీ ప్రభుత్వ నిర్ణయంతో రూ.3కు చేరుకుంది. డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీ పూర్తిగా తొలగిపోయింది.
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 106.33 డాలర్లుగా ఉంది. డబ్ల్యూటీఐ క్రూడ్ ధర 93.5 డాలర్ల వద్ద తచ్చాడుతోంది. ఇటీవల ఇరాన్‌పై దాడులకు 5 రోజుల విరామం ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఈ గడువును మరో 10 రోజులకు పొడిగించారు. ఘర్షణలకు ముగింపు దిశగా ఇరాన్‌తో జరుపుతున్న చర్చలు ప్రోత్సాహకరంగా ఉన్నాయని కూడా ట్రంప్ చెప్పుకొచ్చారు.
ఈ వార్తలూ చదవండి:
వచ్చే ఏడాది భారత జీడీపీ వృద్ధి 6.1 శాతమే..
15 శాతం తగ్గనున్న ఎరువుల ఉత్పత్తి