Share News

విశాఖలో బయటపడ్డ రూ.217 కోట్ల భారీ జీఎస్టీ స్కామ్

ABN , Publish Date - Mar 27 , 2026 | 10:15 AM

విశాఖపట్నంలో రూ.217 కోట్ల భారీ జీఎస్టీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో విస్తరించిన 72 నకిలీ సంస్థల నెట్‌వర్క్‌‌ను డీజీజీఐ అధికారులు ఛేదించారు.

విశాఖలో బయటపడ్డ రూ.217 కోట్ల భారీ జీఎస్టీ స్కామ్
Vizag GST Scam

విశాఖపట్నం, మార్చి 27: డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్(DGGI) అధికారులు నిర్వహించిన మెరుపు దాడుల్లో రూ.217 కోట్ల భారీ జీఎస్టీ మోసం వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తరించిన 72 నకిలీ సంస్థల (Shell Entities) నెట్‌వర్క్‌ను అధికారులు ఛేదించారు. ఈ నకిలీ కంపెనీలు ఎటువంటి వస్తువులను సరఫరా చేయకుండానే కేవలం కాగితాలపై రూ.1,472 కోట్ల విలువైన లావాదేవీలు సృష్టించిన వైనం బయటపడింది.


సామాన్యుల ఆధార్, పాన్ కార్డులను ఉపయోగించి.. తప్పుడు పత్రాలతో ఫోర్జరీ రిజిస్ట్రేషన్లు చేసి ఈ నకిలీ సంస్థలను నడిపిన కేటుగాళ్లను డీజీజీఐ అధికారులు గుర్తించారు. ఈ కేసులో టెక్నికల్ పనులు చూసే సిద్ధగోని ప్రభాకర్, తప్పుడు పత్రాలు సృష్టించిన నాగరాజు నాయక్‌ను అధికారులు అరెస్ట్ చేశారు. ఈ భారీ జీఎస్టీ కుంభకోణానికి ప్రధాన సూత్రధారి ధంట్ల ఆదిరెడ్డి (అంజి రెడ్డి) పరారీలో ఉన్నాడు. అతని కోసం డీజీజీఐ అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు. నిందితులపై సీజీఎస్టీ చట్టం 2017 ప్రకారం బెయిల్ రాని నాన్-బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అత్యాధునిక డేటా అనలిటిక్స్ సాయంతో ఈ భారీ ట్యాక్స్ క్రెడిట్ (ITC) మోసాన్ని విశాఖపట్నం జోనల్ యూనిట్ అధికారులు కనిపెట్టారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది.


ఇవి కూడా చదవండి...

శోభాయాత్ర సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

సింహాచలం కొండ దిగువన గుర్తుతెలియని వ్యక్తుల ఘాతుకం

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 27 , 2026 | 10:24 AM