మామిడి రైతు కన్నీరు..
ABN , Publish Date - May 06 , 2026 | 11:02 AM
చిత్తూరు జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న ఆకాల వర్షాలు, బలమైన గాలులు మామిడి రైతులకు నష్టాన్ని తెచ్చిపెడుతున్నాయి.
గాలివానకు రాలిన కాయలు
మెట్ట ప్రాంతాల్లో అపార నష్టం
మండీలకు చేరుతున్న కాయలు
చిత్తూరు: జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న ఆకాల వర్షాలు, బలమైన గాలులు మామిడి రైతులకు నష్టాన్ని తెచ్చిపెడుతున్నాయి. బేనీషా, మల్లికా రకాలు మరో 10 రోజుల్లో చేతికి వస్తుందని భావించినా ప్రకృతి అనుకూలించలేదు. పలు మండలాల్లో వంద ఎకరాల్లో మామిడి కాయలు నేలరాలినట్లు ఉద్యాన శాఖాధికారులు అంచనా వేశారు. తొలి దశలోనే పూత రాయిపోయినా, మిగిలిన పూతతో కాపు వచ్చి కాయపట్టినా, గాలివాన కారణంగా ఒక్కొ తోపులో దాదాపు 30 శాతం కాయలు రాలిపోయాయి. కవర్లు కట్టినా ప్రయోజనం లేకపోయిందని పలు ప్రాంతాల రైతులు ఆవేదన చెందుతున్నారు మెట్ట, గుట్ట ప్రాంతాల్లోని తోతాపురి చెట్లపై గాలివాన ప్రభావం ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు.
మండీకి చేరిన కాయలు
ఈ సీజన్‌లో తొలిసారిగా మామిడి కాయలు మంగళవారం చిత్తూరు మార్కెట్ యార్డుకు చేరాయి. రెండు మండీల్లో ఐదు టన్నుల కాయలు చేరాయి. రాలి దెబ్బతినడం, పక్వానికి రాకపోవడంతో కాయ ధర పలకలేదు. టన్నుధర రూ.2 వేలకే అమ్ముడు పోయింది. చేసేది లేక తక్కువ ధరకే కాయల్ని అమ్ముతున్నారు. కార్వేటినగరం, యాదమరి, గుడిపాల, బైరెడ్డిపల్లి, బంగారుపాళ్యం, పలమనేరు రూరల్, వి.కోట, తవణంపల్లి, విజయపురం, ఐరాల మండలాలపై గాలివాన ప్రభావం తీవ్రంగా పడింది.
ఈ వార్తలు కూడా చదవండి:
విజయ్ డ్రైవర్ కుమారుడు ఇప్పుడు ఎమ్మెల్యే
మూడు పార్టీలు.. ముగ్గురు ఎమ్మెల్యేలు!
Read Latest Telangana News and National News