Share News

మెట్రో ఫేజ్‌-2 అనుమతుల కోసం ఢిల్లీకి సీఎం రేవంత్

ABN , Publish Date - May 06 , 2026 | 10:41 AM

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 అనుమతుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. సాయంత్రం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను సీఎం కలవనున్నారు.

మెట్రో ఫేజ్‌-2 అనుమతుల కోసం ఢిల్లీకి సీఎం రేవంత్
CM Revanth Reddy

హైదరాబాద్, మే 6: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు(బుధవారం) ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. మెట్రో ఫేజ్‌ - 2 అనుమతుల కోసం ఢిల్లీకి వెళ్లనున్న సీఎం సాయంత్రం 4 గంటలకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌‌తో భేటీకానున్నారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ -2 అనుమతులు, మెట్రో ఫేజ్ -1ను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకున్న అంశాన్ని కేంద్రమంత్రికి వివరించనున్నారు. మెట్రో ఫేజ్‌ - 2కు త్వరగా అనుమతులు ఇవ్వాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేయనున్నారు.


హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌ - 2 విస్తరణకు సంబంధించిన డీపీఆర్‌ను ఇప్పటికే కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సమర్పించింది. ఫేజ్‌ - 2లో మొత్తం 7 కారిడార్లను ప్రతిపాదించింది. మొత్తం 122.9 కిలోమీటర్ల మేర మెట్రోను విస్తరించాలనే ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఫేజ్‌ - 2లో మొత్తం 86 స్టేషన్లను నిర్మించనున్నారు. ప్రాజెక్ట్ మొత్తం అంచనా వ్యయం రూ.38,595 కోట్లు. ప్రస్తుతం హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌-1 నెట్‌వర్క్‌ 69.2 కిలోమీటర్లుగా ఉంది. ఫేజ్‌ -2 పూర్తయితే హైదరాబాద్‌ మెట్రో మొత్తం నెట్‌వర్క్‌ 191.9 కిలోమీటర్లకు విస్తరించనుంది.


అలాగే.. మధ్యాహ్నం ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నట్లు సమాచారం.


ఇవి కూడా చదవండి...

బిల్లు కట్టమన్నందుకు రెస్టారెంట్ సిబ్బందిపై మూకుమ్మడి దాడి

అన్నదాతల అరిగోస ప్రభుత్వానికి పట్టదా: బండి సంజయ్

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 06 , 2026 | 10:49 AM