మూడు పార్టీలు.. ముగ్గురు ఎమ్మెల్యేలు!
ABN , Publish Date - May 06 , 2026 | 06:29 AM
తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో ‘లాటరీ కింగ్’గా పేరొందిన మార్టిన్ కుటుంబానికి చెందిన ముగ్గురు...
‘లాటరీ కింగ్’ మార్టిన్ భార్య, కుమారుడు, అల్లుడి విజయం
చెన్నై, మే 5(ఆంధ్రజ్యోతి): తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో ‘లాటరీ కింగ్’గా పేరొందిన మార్టిన్ కుటుంబానికి చెందిన ముగ్గురు వేర్వేరు పార్టీల తరఫున అభ్యర్థులుగా పోటీ చేసి విజయం సాధించారు. విల్లివాక్కం నియోజకవర్గంలో టీవీకే తరఫున బరిలోకి దిగిన మార్టిన్ అల్లుడు ఆదవ్ అర్జున 17,276 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. టీవీకేలో ఆయన క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా మార్టిన్ సతీమణి అయిన లీమా రోస్ అన్నాడీఎంకే తరఫున లాల్గుడి నియోజకవర్గం నుంచి గెలిచారు. మార్టిన్ కుమారుడు, లచ్చియ జననాయగ కట్చి(ఎల్‌జేకే) పార్టీ అధ్యక్షుడు జోస్ చార్లెస్ పుదుచ్చేరిలోని కామరాజ్‌నగర్ నియోజకవర్గంలో విజయం సాధించారు.
ఇవి కూడా చదవండి
గల్ఫ్‌లో తెలుగు యువతి ఆత్మహత్య.. కుటుంబపోషణ కోసం వెళ్లి..
రిసార్ట్‌కు టీవీకే ఎమ్మెల్యేలు.. తిరుచిరాపల్లిని వదులుకోనున్న విజయ్