Share News

విజయ్‌ డ్రైవర్‌ కుమారుడు ఇప్పుడు ఎమ్మెల్యే

ABN , Publish Date - May 06 , 2026 | 06:27 AM

తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించిన టీవీకే అధినేత విజయ్‌.. అభ్యర్థుల ఎంపికలో తీసుకున్న నిర్ణయాలు...

విజయ్‌ డ్రైవర్‌ కుమారుడు ఇప్పుడు ఎమ్మెల్యే

చెన్నై, మే 5 (ఆంధ్రజ్యోతి): తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించిన టీవీకే అధినేత విజయ్‌.. అభ్యర్థుల ఎంపికలో తీసుకున్న నిర్ణయాలు కూడా సంచలనంగా మారాయి. చాలాకాలంగా తన వద్ద కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న రాజేంద్రన్‌ కుమారుడు శబరినాథన్‌కు ఆయన ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చారు. చెన్నై నడిబొడ్డున విరుగంబాక్కం నియోజకవర్గం నుంచి పోటీచేసిన శబరినాథన్‌ 27,086 ఓట్ల మెజారిటీతో డీఎంకే నేత ఏఎంవీ ప్రభాకర్‌ రాజాపై విజయం సాధించారు. విజయ్‌ తన పేరు ప్రకటించినప్పుడే తీవ్ర భావోద్వేగానికి గురైన శబరినాథన్‌.. ఆయన కాళ్లకు సాష్టాంగ నమస్కారం చేశారు. ఆయనను హత్తుకున్న విజయ్‌..‘నా ఫోటో పెట్టుకుని ప్రచారం చెయ్‌.. ఎమ్మెల్యేగా కనిపించు..’ అని వెన్నుతట్టి పంపించినట్లు సమాచారం. ఆయన చెప్పినట్లే ఎమ్మెల్యేగా గెలిచిన శబరినాథన్‌.. మంగళవారం టీవీకే శాసనసభాపక్ష సమావేశానికి హాజరయ్యారు.

ఇవి కూడా చదవండి

గల్ఫ్‌లో తెలుగు యువతి ఆత్మహత్య.. కుటుంబపోషణ కోసం వెళ్లి..

రిసార్ట్‌కు టీవీకే ఎమ్మెల్యేలు.. తిరుచిరాపల్లిని వదులుకోనున్న విజయ్

Updated Date - May 06 , 2026 | 06:27 AM