Share News

ఈకేవైసీ లేకుంటే.. సిలిండర్‌ కట్‌

ABN , Publish Date - Jul 14 , 2026 | 01:17 PM

జూన్‌ 30లోగా ఈకేవైసీ చేయించుకోని గ్యాస్‌ వినియోగదారులకు సిలిండర్‌ బుకింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు.

ఈకేవైసీ లేకుంటే.. సిలిండర్‌ కట్‌
LPG eKYC, verification

  • వినియోగదారులకు ఆయిల్‌ కంపెనీల షాక్‌ ఫ ఏజెన్సీల్లో పునరుద్ధరించుకునే అవకాశం

సూళ్లూరుపేట(తిరుపతి): జూన్‌ 30లోగా ఈకేవైసీ చేయించుకోని గ్యాస్‌ వినియోగదారులకు సిలిండర్‌ బుకింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈకేవైసీ చేయించుకోకుంటే భవిష్యత్తులో సమస్యలు తప్పనిసరి అనేకసార్లు ఆయిల్‌ కంపెనీలు హెచ్ఛరించినా చాలా మందికి అవగాహన లేక చేయించుకోలేదు. దీంతో తిరుపతి జిల్లాలోనే వేలాది మందికి బుకింగ్‌కు అవకాశం లేకుండా పోయింది. ఈకేవైసీ పూర్తి చేసిన తర్వాతే మళ్లీ బుకింగ్‌ను స్వీకరించి సిలిండర్లు పంపించనున్నారు.


అక్రమ కనెక్షన్లకు చెక్‌..

గతంలో దీపం పథకం ద్వారా డిపాజిట్‌ చెల్లించకుండా ఉచితంగా కనెక్షన్‌, పొయ్యి, రెగ్యులేటర్‌ అన్నీ ఇచ్చారు. ఉజ్వల ద్వారా రాయితీలు పొందుతున్నారు. ఈ రెండింటి ద్వారా జిల్లాలో 2లక్షలమంది వరకు లబ్ధి పొందుతున్నట్లు అంచనా. గతంలో ఈకేవైసీ సమస్య లేనందున కొందరు చనిపోయినా వారి బంధువులు అనధికారికంగా కనెక్షన్లు కొనసాగిస్తున్నారు. వారి సొంత కనెక్షన్‌కు వచ్చే సిలిండర్లు బుక్‌ చేసుకుని నల్లబజారులో అమ్ముకుంటున్నారు. ప్రస్తుతం కనెక్షన్‌ ఎవరి పేరు మీద ఉంటే వారే ఈకేవైసీ చేయాల్సి రావడంతో అనధికారిక కనెక్షన్లు శాశ్వతంగా నిలిచిపోనున్నాయి.


cylen1.2.jpgదాదాపు 10శాతం మంది వినియోగదారులు ఈకేవైసీ చేయించుకోలేదు. ఇందులో చనిపోయిన వినియోగదారులు 5శాతం వరకు ఉంటారు. గ్యాస్‌ వినియోగిస్తూ ఈకేవైసీ చేయించుకోని వారు 3శాతం వరకు ఉంటారు. గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నా వేలిముద్రలు నమోదు కాని వృద్ధులు 2శాతం ఉంటారు. ఈకేవైసీ లేకుంటే బుకింగ్‌ నిలిచిపోవడంతో పాటు కేంద్ర ప్రభుత్వం గ్యాస్‌ సిలిండర్లపై ఇస్తున్న రాయితీ కూడా జమకాదు.


ఇలా చేస్తే సరి..

తాత్కాలికంగా బుకింగ్‌ నిలిపివేసిన గ్యాస్‌ కనెక్షన్‌ను మళ్లీ పునరుద్ధరించుకునేందుకు అవకాశం ఉంది. గ్యాస్‌ ఏజన్సీకి వెళ్లి ఆధార్‌ ఇస్తే వేలిముద్ర తీసుకుని ఏజెన్సీ నిర్వాహకులే ఉచితంగా చేస్తారు. లేదా గ్యాస్‌ డెలివరీ వారి దగ్గర కూడా ఈకేవైసీ యంత్రాలు ఉంటాయి. వారి ద్వారా కూడా ప్రక్రియ పూర్తి చేయవచ్చు. వెంటనే గ్యాస్‌ కనెక్షన్‌ పునరుద్ధరణ అవుతుంది.


మార్చుకోవచ్చు..

వృద్ధాప్యంలో వేలి ముద్రలు పడని వారు ఆధార్‌ సెంటర్‌కు వెళ్లి ఐరిస్‌ అప్‌డేట్‌ చేసుకుంటే దాని ద్వారా ఈకేవైసీ చేయించుకోవచ్చు. లేదా కదల్లేని వృద్ధుల పేరు మీద ఉన్న కనెక్షన్‌ కుటుంబ సభ్యుల పేరిట మార్చుకునే అవకాశం ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి:

కల్యాణదుర్గం ఎమ్మెల్యేకు ప్రశ్న రావణ్‌ వేధింపులు..

‘గుడ్డు’పుఠాణి.. ఐసీడీఎస్‏లో అధికారులు, కాంట్రాక్టర్ల కుమ్మక్కు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 14 , 2026 | 01:17 PM