గురువారం జాతిని ఉద్దేశించి ట్రంప్ ప్రసంగం.. ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో కీలక ప్రకటనపై ఉత్కంఠ..
ABN , Publish Date - Jul 14 , 2026 | 11:24 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం రాత్రి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రత్యేక ప్రసంగం చేయనున్నట్లు ప్రకటించారు. ఇటీవల ఇరాన్‌తో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ ఈ ప్రకటన రావడంతో ట్రంప్ ఏ అంశాలపై మాట్లాడతారన్న ఆసక్తి నెలకొంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం రాత్రి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రత్యేక ప్రసంగం చేయనున్నట్లు ప్రకటించారు. ఇటీవల ఇరాన్‌తో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ ఈ ప్రకటన రావడంతో ట్రంప్ ఏ అంశాలపై మాట్లాడతారన్న ఆసక్తి నెలకొంది. అయితే తన ప్రసంగంలో ఏ విషయాలను ప్రస్తావించనున్నారో ఆయన ఇప్పటివరకు వెల్లడించలేదు (Donald Trump speech).
ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక 'ట్రూత్' ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. 'గురువారం రాత్రి 9 గంటలకు (అమెరికా కాలమానం ప్రకారం) దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తాను. ఈ విషయాన్ని గమనించండి' అని ఆయన పేర్కొన్నారు. అమెరికా కాలమానం ప్రకారం రాత్రి 9 గంటలకు జరిగే ఈ ప్రసంగం, భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం ప్రసారం కానుంది (Trump address to nation).
ఇరాన్‌పై అమెరికా నావికా దిగ్బంధనాన్ని తిరిగి విధిస్తామని, హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై వాషింగ్టన్ 20 శాతం రుసుము విధిస్తుందని ట్రంప్ ప్రకటించిన కొన్ని గంటల తర్వాత ఈ ప్రకటన వెలువడింది (Trump Thursday speech). ఇరాన్ అంశంపై అమెరికా వైఖరి, అలాగే దేశీయ రాజకీయాలు, ఎన్నికల భద్రత వంటి పలు అంశాలను ట్రంప్ ప్రస్తావించే అవకాశం ఉందని అమెరికా మీడియా కథనాలు సూచిస్తున్నాయి. అయితే వైట్ హౌస్ అధికారికంగా ప్రసంగ అంశాలను వెల్లడించలేదు.
ఇవి కూడా చదవండి..
నష్టాలతో ప్రారంభమైన సూచీలు.. 300 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
యూపీలో బోర్డర్ దాటుతూ పట్టుబడిన వ్యక్తి.. అమెరికా నేవీలో పని చేసేవాడినని చెబుతూ..