యూపీలో బోర్డర్ దాటుతూ పట్టుబడిన వ్యక్తి.. అమెరికా నేవీలో పని చేసేవాడినని చెబుతూ..
ABN , Publish Date - Jul 14 , 2026 | 10:22 AM
ఉత్తరప్రదేశ్‌లోని భారత్-నేపాల్ సరిహద్దు వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న అమెరికా పౌరుడిని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి.
ఉత్తరప్రదేశ్‌లోని భారత్-నేపాల్ సరిహద్దు వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న అమెరికా పౌరుడిని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. తన పేరు జోర్డాన్ బ్రౌన్ అని, తాను అమెరికాలోని కాలిఫోర్నియా నివాసినని, గతంలో అమెరికా నేవీలో పనిచేశానని అతడు విచారణలో తెలిపాడు. అయితే అతడి వద్ద పాస్‌పోర్ట్, వీసా లేదా ఇతర చెల్లుబాటు అయ్యే ప్రయాణ పత్రాలు ఏవీ లేకపోవడంతో అధికారులు అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు (US citizen arrested).
మహారాజ్‌గంజ్ జిల్లాలోని సోనౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో సశస్త్ర సీమా బల్ (SSB) 22వ బెటాలియన్ సిబ్బంది సాధారణ గస్తీ నిర్వహిస్తున్న సమయంలో సరిహద్దు స్తంభం నంబర్-516 సమీపంలో ఈ వ్యక్తిని గుర్తించారు. భద్రతా సిబ్బంది ఆపేందుకు ప్రయత్నించగా అతడు అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడని అధికారులు తెలిపారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు (India Nepal border).
విచారణలో జోర్డాన్ బ్రౌన్ ఆసక్తికరమైన వివరాలు వెల్లడించాడు. థాయ్‌లాండ్‌కు పర్యాటక వీసాపై వెళ్లిన సమయంలో తన పాస్‌పోర్ట్ పోయిందని, అనంతరం సముద్ర మార్గంలో శ్రీలంక చేరుకుని అక్కడి నుంచి 2025 నవంబర్ 2న భారత్‌కు వచ్చినట్లు చెప్పాడు. అప్పటి నుంచి గోవాలో నివసిస్తూ, తరువాత బెంగళూరు మీదుగా ఉత్తరప్రదేశ్‌లోని సోనౌలి సరిహద్దుకు చేరుకుని నేపాల్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించినట్లు తెలిపాడు (ormer US Navy officer arrested).
అంటే, దాదాపు ఏడు నెలలుగా అతడు చెల్లుబాటు అయ్యే పత్రాలు లేకుండానే భారత్‌లో ఉన్నాడా అనే కోణంలో కూడా అధికారులు విచారణ చేస్తున్నారు. అతడి వద్ద నిర్వహించిన తనిఖీలో రూ.31,460 నగదు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే పాస్‌పోర్ట్, వీసా లేదా గుర్తింపు కార్డు వంటి ఎలాంటి అధికారిక పత్రాలు లభించలేదు. అతడు నిజంగానే మాజీ అమెరికా నేవీ అధికారా? లేక తప్పుడు వివరాలు చెబుతున్నాడా? అనే అంశాలపై విచారణ కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి
దొంగతనం చేశారనే అనుమానంతో కరెంట్ షాక్.. వీడియో వైరల్
హైదరాబాద్‌లోని ఈ ఏరియాల్లో 12 గంటల నుంచి కరెంట్ కట్..