నష్టాలతో ప్రారంభమైన సూచీలు.. 300 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
ABN , Publish Date - Jul 14 , 2026 | 09:38 AM
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు దేశీయ సూచీలను నష్టాల బాటలో నడిపిస్తున్నాయి. ఇరాన్-అమెరికా యుద్దం నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగాయి.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు దేశీయ సూచీలను నష్టాల బాటలో నడిపిస్తున్నాయి. ఇరాన్-అమెరికా యుద్దం నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడాయిల్ ధర పెరగడంతో డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ (96.14) భారీగా పతనమైంది. మరోవైపు బ్యాంకింగ్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో కదలాడుతున్నాయి (Indian stock market).
గత సెషన్ ముగింపు (77,616)తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం దాదాపు 400 పాయింట్ల నష్టంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత కొద్దిగా పుంజుకుంది. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 329 పాయింట్ల నష్టంతో 77,287 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతోంది. ప్రస్తుతం 71 పాయింట్ల నష్టంతో 24,139 వద్ద కదలాడుతోంది (stock market news today).
సెన్సెక్స్, నిఫ్టీలో బయోకాన్, కంటైనర్ కొర్పొరేషన్, ఎమ్‌సీఎక్స్ ఇండియా, నాల్కో, ఆస్ట్రాల్ ఇండియా మొదలైన షేర్లు లాభాల్లో ఉన్నాయి (share market news). ఎల్ అండ్ టీ ఫైనాన్స్, పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్, అశోక్ లేలాండ్, లోధా డెవలపర్స్, చోలా ఇన్వెస్ట్ మొదలైన షేర్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 429 పాయింట్ల నష్టంతో ఉంది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 186 పాయింట్ల నష్టంతో ఉంది.
ఇవి కూడా చదవండి
దొంగతనం చేశారనే అనుమానంతో కరెంట్ షాక్.. వీడియో వైరల్
హైదరాబాద్‌లోని ఈ ఏరియాల్లో 12 గంటల నుంచి కరెంట్ కట్..