తిరుపతి జిల్లాలో మాజీ మంత్రి రోజా హంగామా.. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు
ABN , Publish Date - Nov 07 , 2026 | 03:11 PM
తిరుపతి జిల్లాలోని ఇల్లెత్తూరు ఎంపీటీసీ కౌంటింగ్ వద్ద మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత ఆర్కే రోజా హంగామా సృష్టించారు. ఈ కౌంటింగ్ కేంద్రం వద్ద ఆమె నిరసన తెలిపారు.
తిరుపతి జిల్లా, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): తిరుపతి జిల్లాలోని ఇల్లెత్తూరు ఎంపీటీసీ కౌంటింగ్ వద్ద మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత ఆర్కే రోజా (Former Minister Roja) హంగామా సృష్టించారు. ఈ కౌంటింగ్ కేంద్రం వద్ద ఆమె నిరసన తెలిపారు. రీకౌంటింగ్‌తో ఇల్లెత్తూరు ఎంపీటీసీ ఎన్నికల ఫలితం తారుమారైన విషయం తెలిసిందే. తొలుత 10 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి దేవి విజయం సాధించారు. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జయప్రద రీకౌంటింగ్ కోరారు. రీకౌంటింగ్‌లో 3 ఓట్ల ఆధిక్యంతో టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు. ఫలితం మారడంపై వైసీపీ అభ్యర్థి దేవి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆరోపించారు. తమ ఓట్లను టీడీపీ ఖాతాలో కలిపి లెక్కించారంటూ దేవి ఆరోపించారు. మరోసారి రీకౌంటింగ్ నిర్వహించాలని వైసీపీ శ్రేణులు డిమాండ్ చేశాయి. రీకౌంటింగ్‌కు అధికారులు అంగీకరించడం లేదని వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కౌంటింగ్ కేంద్రం వద్ద రోజా ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. ఈ నేపథ్యంలోనే రోజా రెచ్చిపోయి పోలీసులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆ ప్రాంతంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. వెంటనే రోజాను జీపు ఎక్కించి పోలీస్ స్టేషన్‌కు పోలీసులు తరలించినట్లు సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి..
తుఫాన్ బాధితులకు అండగా ఉంటాం.. అధైర్యపడొద్దు: సీఎం చంద్రబాబు
ఏపీ విపత్తు నిర్వహణ భేష్.. ప్రభుత్వ పనితీరుపై కేంద్రం ప్రశంసలు
పదే పదే అవమానించడంతోనే వైసీపీ నుంచి బయటకు వచ్చా: విజయసాయిరెడ్డి
Read Latest Telangana News And AP News And National News
And Telugu News