Share News

కొవిడ్‌ అలర్ట్‌.. రాజంపేటలో ఒకరి మృతి

ABN , Publish Date - Jul 09 , 2026 | 01:45 PM

కడప జిల్లా రాజంపేటకు చెందిన ఒక వ్యక్తి(52) కొవిడ్‌ కారణంగా చనిపోవడంతో వైద్యశాఖ అప్రమత్తమైంది.

కొవిడ్‌ అలర్ట్‌.. రాజంపేటలో ఒకరి మృతి
COVID 19 Alert, Tirupati

  • రుయాలో అప్రమత్తం

  • భయపడాల్సిన పనిలేదంటున్న వైద్యులు

తిరుపతి: కడప జిల్లా రాజంపేటకు చెందిన ఒక వ్యక్తి(52) కొవిడ్‌ కారణంగా చనిపోవడంతో వైద్యశాఖ అప్రమత్తమైంది. అన్ని జిల్లాల్లో ఆరా తీయగా కడప, తిరుపతి జిల్లాల్లో 5 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు గుర్తించింది. దీంతో మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ (డీఎంఈ) రాష్ట్రంలోని ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రుల సూపరింటెండెంట్లకు లేఖలు రాశారు. కొవిడ్‌ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని, ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్న ఐసోలేషన్‌ బెడ్లు, ఐసీయూ పడకలు, ఆక్సిజన్‌ సౌకర్యం, వెంటిలేటర్లు, మందులు, ర్యాపిడ్‌ కిట్లు, అంబులెన్స్‌ వంటి వైద్య సిబ్బంది వివరాలతో నివేదిక పంపాలని ఆదేశించారు.


covid1.2.jpgఇటీవల నమోదైన కేసుల నేపథ్యంలో అవసరమైతే వెంటనే చికిత్స అందించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉంచాలని వైద్యాధికారులకు సూచించినట్టు సమాచారం.కడప జిల్లా రాజంపేటకు చెందిన ఒక వ్యక్తి (52) తీవ్రమైన ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ గత నెల 24న వేలూరు సీఎంసీలో చికిత్స నిమిత్తం చేరారు. నిమోనియా వ్యాధిని గుర్తించారు. అనుమానంతో కొవిడ్‌ పరీక్ష చేయగా 26వ తేది పాజిటివ్‌ వచ్చింది. చికిత్స పొందుతూ 28న మృతిచెందడంతో వైద్యశాఖ అప్రమత్తమైంది.


covid1.jpgఅప్రమత్తంగా ఉన్నాం

కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదైన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని డీఎంఈ ఆదేశిచ్చారు. రుయాలో కొవిడ్‌ ఐసోలేషన్‌ వార్డు ఏర్పాటుచేశాం. కొవిడ్‌ టెస్ట్‌ కిట్లు, సిబ్బంది, అవసరమైన మందులతో సిద్ధంగా ఉన్నాం. రుయాలో ఇప్పటివరకు ఎలాంటి కేసులు నమోదుకాలేదు. ప్రస్తుతం నమోదైన కేసుల్లో తీవ్రమైన లక్షణాలు లేవని, అయినప్పటికీ అప్రమత్తంగా ఉండాలని భావిస్తున్నాం.

  • డాక్టర్‌ మనోహర్‌, సూపరింటెండెంట్‌, రుయాస్పత్రి


ఆందోళన వద్దు...అశ్రద్ధ వద్దు

కరోనాతో గతంలో లాగా భయపడాల్సిన పనిలేదు. వాతావరణంలో మార్పుల కారణంగా రోగనిరోధక శక్తి తగ్గినవారు అశ్రద్ధ చేయకూడదు. జ్వరం, దగ్గు, గొంతునొప్పి వంటి లక్షణాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. వృద్ధులు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

  • డాక్టర్‌ సుబ్బారావు, ఊపిరితిత్తుల వ్యాధి నిపుణుడు, రుయాస్పత్రి


ఈ వార్తలు కూడా చదవండి:

ఇక నుంచి మీ సంగతి చూస్తాం... కొడాలి నానికి బుద్దా వెంకన్న వార్నింగ్

యూట్యూబర్ జోసఫ్ రావణ్ బ్యాంక్ ఖాతాల ఫ్రీజ్

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jul 09 , 2026 | 01:45 PM