Share News

అమెరికాలో ఏపీ విద్యార్థిని మృతి.. ఆలయానికి వెళ్తుండగా ఘోర ప్రమాదం..

ABN , Publish Date - Jul 09 , 2026 | 12:28 PM

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ యువ విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని నింపింది. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ప్రసన్న అట్లూరి (25) న్యూయార్క్ రాష్ట్రంలో జరిగిన కారు ప్రమాదంలో మరణించింది.

అమెరికాలో ఏపీ విద్యార్థిని మృతి.. ఆలయానికి వెళ్తుండగా ఘోర ప్రమాదం..
Prasanna Atluri

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ యువ విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని నింపింది. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ప్రసన్న అట్లూరి (25) న్యూయార్క్ రాష్ట్రంలో జరిగిన కారు ప్రమాదంలో మరణించింది. స్నేహితులతో కలిసి ఆలయానికి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. జులై 5వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది (Indian Student Dies in US).


జులై 5న ప్రసన్న తన స్నేహితులతో కలిసి కారులో ప్రయాణిస్తూ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగింది. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో కారు వారి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రసన్న అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో మరో యువతి కూడా ప్రాణాలు కోల్పోగా.. ఇంకొకరు తీవ్రంగా గాయపడ్డారు (Road Accident USA).


ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామానికి చెందిన ప్రసన్న అమెరికాలోని పేస్ యూనివర్సిటీలోని లుబిన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో చదువు పూర్తి చేసింది (Andhra Student Dies in US). ఇటీవలే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది. ప్రసన్న మృతదేహాన్ని భారత్‌కు తీసుకువచ్చేందుకు సహకరించాల్సిందిగా సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్‌ను కుటుంబ సభ్యులు అభ్యర్థించారు.


ఇవి కూడా చదవండి..

మరోసారి ఇరాన్‌పై అమెరికా దాడులు.. కొనసాగుతున్న ఉద్రిక్తత..


మరింతగా తగ్గిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..

Updated Date - Jul 09 , 2026 | 01:24 PM