అమెరికా దాడులతో ధ్వంసమైన ఖమేనీ భవనం.. వీడియో విడుదల చేసిన ఇరాన్..
ABN , Publish Date - Jul 09 , 2026 | 11:41 AM
ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ నివాసం ధ్వంసమైన దృశ్యాలను తొలిసారిగా ఆ దేశ ప్రభుత్వ మీడియా విడుదల చేసింది. ఖమేనీ అంత్యక్రియల సందర్భంగా ఈ వీడియోను బయటపెట్టింది.
ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ నివాసం ధ్వంసమైన దృశ్యాలను తొలిసారిగా ఆ దేశ ప్రభుత్వ మీడియా విడుదల చేసింది. ఖమేనీ అంత్యక్రియల సందర్భంగా ఈ వీడియోను బయటపెట్టింది. టెహ్రాన్‌లోని ఖమేనీ అధికారిక నివాస సముదాయం తీవ్రంగా దెబ్బతిన్నట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది (Ali Khamenei House).
ఈ ఏడాది ఫిబ్రవరి 28న జరిగిన అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఖమేనీ మరణించినట్లు ఇరాన్ ఇప్పటికే ప్రకటించింది (Israel Iran Conflict). అదే దాడిలో ఆయన కుటుంబ సభ్యులు కూడా ప్రాణాలు కోల్పోయారు.
తాజాగా విడుదల చేసిన వీడియోలో శిథిలాలుగా మారిన భవనాలు, పేలుళ్ల ప్రభావంతో కూలిపోయిన నిర్మాణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. యుద్ధం వల్ల జరిగిన విధ్వంసాన్ని ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఇరాన్ ఈ వీడియోలను బయటపెట్టింది.
ఇవి కూడా చదవండి..
మరోసారి ఇరాన్‌పై అమెరికా దాడులు.. కొనసాగుతున్న ఉద్రిక్తత..
మరింతగా తగ్గిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..