పులివెందుల ప్రజలు జగన్‌ను ఓడించి జ్ఞానోదయం కలిగించారు: ఎమ్మెల్సీ వర్ల రామయ్య
ABN , Publish Date - Nov 17 , 2026 | 08:01 PM
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు కుట్రలకు పాల్పడుతున్నాయని ఎమ్మెల్సీ వర్ల రామయ్య ఆరోపించారు. చట్టాన్ని ఉల్లంఘిస్తూ.. వారే ఎలక్షన్ కమిషన్‌కు ఫేక్ ఫిర్యాదులు చేస్తున్నారని మండిపడ్డారు.
విజయవాడ, నవంబర్ 17: ఏపీలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో.. వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు కుట్రలకు పాల్పడుతున్నాయని ఎమ్మెల్సీ వర్ల రామయ్య ఆరోపించారు. వాటిని ఎదుర్కోవడంలో పోలీసుల నిర్లిప్తత స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఈ మేరకు ఆయన వైసీపీని తీవ్రంగా విమర్శించారు.
‘పులివెందుల ప్రజలు జగన్‌ను ఓడించి ఆయనకు జ్ఞానోదయం కల్పించారు. జగన్ ఓడిపోయిన అసూయలో ఉన్నారు. అసూయతోనే వైసీపీ నేతలు దాడులకు దిగుతున్నారు. చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. వేంపల్లిలో మా పార్టీ మీటింగ్ జరిగింది. మీటింగ్ అనంతరం మా నాయకుడిపై దాడి చేశారు. కావలిలో నామినేషన్ చెల్లదని తిరస్కరించిన ఆర్వోను వైసీపీ నేత రామ్ ప్రతాప్ రెడ్డి చెంపదెబ్బ కొట్టారు. పోలీసులు కూడా వైసీపీ వాళ్లను అడ్డుకోలేక పోతున్నారు. మీకు వ్యతిరేకంగా.. చట్టబద్ధంగా నడుచుకుంటే చంపేస్తారా? మీరే దాడులు చేసుకుంటారు.. మీరే కార్లు తగలబెట్టుకుంటారు.. టీడీపీ వాళ్ళపై నెపం మోపుతూ.. సిగ్గు లేకుండా SEC దగ్గరకు వచ్చి ఫేక్ ఫిర్యాదులు చేస్తున్నారు. గుంటూరు జైలు వద్ద సజ్జల,పెద్దిరెడ్డి చేసిన అరాచకంపై చర్యలు చేపట్టాలి’ అని రామయ్య డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి...
విశాఖలో 20 ఏళ్ల యువతి అనుమానాస్పద మృతి
రెండు తుపాన్లను ఎదుర్కొన్నాం.. ఈ తుపానుకు సన్నద్ధంగా ఉండాలి.. అధికారులతో హోంమంత్రి
Read Latest AP News And Telugu News