ఏపీ స్థానిక ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు ఖరారు.. సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం
ABN , Publish Date - Oct 14 , 2026 | 08:06 PM
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో టీడీపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు చర్చలు సఫలమయ్యాయి. ఈ మేరకు సీఎం చంద్రబాబుతో జరిగిన జనసేన నాయకుల సమన్వయ సమావేశంలో సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం కుదిరినట్లు జనసేన ఎమ్మెల్యేలు వెల్లడించారు.
అమరావతి, అక్టోబర్ 14: ఆంధ్రపదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై చర్చలు సఫలం అయ్యాయి. ఈ మేరకు 2024 ఎన్నికల మాదిరిగానే.. స్థానికసంస్థల ఎన్నికల్లోనూ ఈ పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయి.
జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి మీడియాతో మాట్లాడారు. ‘కూటమి పార్టీల్లో ఎలాంటి విభేదాలు లేవు. 2024లో కూటమి తరహాలోనే స్థానిక ఎన్నికలకు పోటీచేస్తాం. కూటమి సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి వచ్చాయి. ఎవరికి బలమున్న చోట వారు పోటీ చేస్తారు. సింగిల్ ఎజెండాతో కూటమిగానే పోటీలోకి దిగనున్నాం. కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా ఎన్నికల్లో పోటీ చేస్తాం. ఎలాంటి పర్సంటేజీల కోసం చర్చించలేదు. సీట్ల రేషియో కాదు.. గెలుపే లక్ష్యంగా కూటమి పార్టీలు పనిచేస్తాయి. రెండు రోజుల్లో జనసేన అభ్యర్థులను ప్రకటిస్తాం. పార్టీ పరంగా కాకుండా.. కూటమి పరంగా అభ్యర్థులను ప్రకటిస్తాం’ అని పేర్కొన్నారు.
అనంతరం ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ.. జనసేన పార్టీ నేత పవన్ కల్యాణ్ చెప్పినట్లు కేడర్ సంతృప్తి చెందేలా స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తామని పేర్కొన్నారు. ఎవరు ఎక్కడ పోటీ చేయాలనే క్లారిటీ కూటమి పార్టీలకు ఉందని ఆయన తెలిపారు. రాష్ట్రం బాగు కోసం జనసేన కట్టుబడి ఉందని వంశీకృష్ణ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పవన్ సమక్షంలో జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ
మటన్ మండిలో పుచ్చిపోయిన పన్ను.. హైదరాబాద్ రెస్టారెంట్లో కలకలం
Read Latest AP News And Telugu News