Share News

పెరుగుతున్న తుంగభద్ర నీటిమట్టం

ABN , Publish Date - Aug 14 , 2026 | 01:11 PM

తుంగభద్ర జలాశయంలో నీటి నిల్వ 87.45 టీఎంసీలకు చేరింది. జలాశయం నీటిమట్టం 1,628.20 అడుగులకు చేరింది.

పెరుగుతున్న తుంగభద్ర నీటిమట్టం
Tungabhadra Dam water level

  • డ్యాంలో 87.45 టీఎంసీలకు చేరిక..

బొమ్మనహాళ్‌(అనంతపురం): తుంగభద్ర జలాశయంలో నీటి నిల్వ 87.45 టీఎంసీలకు చేరింది. జలాశయం నీటిమట్టం 1,628.20 అడుగులకు చేరింది. గత 24 గంటల్లో సగటున 26,834 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం 23,290 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. జలాశయం నుంచి వివిధ కాలువలకు 2,226 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.


pandu1.jpgత్రివర్ణ శోభితం..!

కంప్లి(బెంగళూరు): తుంగభద్ర జలాశయం నూతన క్రస్ట్‌ గేట్లు మూడు రంగులతో ఆకట్టుకున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం రెండు రోజులు ఉండగానే జలాశయం బోర్డు అధికారులు క్రస్ట్‌గేట్లు రంగులు విద్యుత్‌ కాంతులతో పర్యాటకులను ఆకట్టుకునేలా మార్చారు. ఈ ఏడాది జలాశయంలోకి ప్రస్తుతం భారీగా నీరు చేరుతున్నాయి. 15వ తేదీన జలాశయాన్ని తిలకించడానికి పర్యాటకులు భారీగా తరలిరానుండటంతో ఈపాటికే జలాశయం వచ్చేవారికి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టామని బోర్డడ అధికారులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ఓనం ఉత్సవాలకు 16నుంచి చర్లపల్లి-కొట్టాయం మధ్య స్పెషల్‌ రైళ్లు

ఇక ‘స్మార్ట్’గా రేషన్...

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 14 , 2026 | 01:11 PM