జగన్ అసెంబ్లీకి రాని మొద్దు విద్యార్థి: ఎంపీ కేశినేని శివనాథ్
ABN , Publish Date - Aug 14 , 2026 | 12:37 PM
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఎంపీ కేశినేని శివనాథ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ మానసిక పరిస్థితి బాగోలేదన్నారు. జగన్ ఒక తప్పిన విద్యార్థి కాబట్టే.. అసెంబ్లీకి రావడం లేదని వ్యాఖ్యానించారు.
విజయవాడ, ఆగస్టు 14: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ మానసిక పరిస్థితి బాగోలేదన్నారు. జగన్ ఒక తప్పిన విద్యార్థి కాబట్టే.. అసెంబ్లీకి రావడం లేదని వ్యాఖ్యానించారు. అసెంబ్లీకి వస్తే ఏపీపీఎస్సీలో జరిగిన అక్రమాలు అన్నిటినీ ప్రశ్నిస్తారన్న భయంతో ముఖం చాటేశారని అన్నారు. జగన్ అసెంబ్లీకి రాని ఒక మొద్దు విద్యార్థి అంటూ దుయ్యబట్టారు. ఈరోజు డీఎస్సీపై విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ కలిసి భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారని తెలిపారు. జెన్ జీ ఉద్యమాల పేరిట 50, 60 సంవత్సరాల వయసుగల వారితో తాము ఉద్యమాలు చేయడం లేదంటూ సెటైర్ విసిరారు.
ఈనెల 16న(ఆదివారం)విజయవాడ నడిబొట్టులో ఉపాధ్యాయులు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారని ఎంపీ చెప్పారు. ఈ ర్యాలీలు చూసైనా జగన్ బుద్ధి తెచ్చుకోవాలని హితవుపలికారు. ఏపీపీఎస్సీలో జరిగిన అక్రమాలను డైవర్ట్ చేయడానికి డీఎస్సీలో అవకతవకలు జరిగాయంటూ.. వైసీపీ విషయాన్ని పక్కదారి పట్టిస్తోందని ఆరోపించారు. జెన్ జీ అంతా నారా లోకేశ్, పవన్ కల్యాణ్ వెనకే ఉన్నారని తెలిపారు. జగన్ చేసే ర్యాలీలు చూపిస్తే పార్లమెంట్ వేదికగా ఉన్న వారంతా ఈ వయసు వాళ్లంతా జెన్ జీ లా అని నవ్వుతున్నారని ఎద్దేవా చేశారు. జగన్ ఎన్ని చెప్పినా అసెంబ్లీ వేదికగా ఏపీపీఎస్సీలో జరిగిన అక్రమాలపై చర్చించి తీరుతామని ఎంపీ కేశినేని చిన్ని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
శ్రావణ మాసం మొదటి శుక్రవారం.. దుర్గమ్మ ఆలయంలో భక్తుల సందడి
కాకాణి కనుసన్నల్లో భూ అక్రమాలు.. కూటమి ప్రభుత్వం సీరియస్
Read Latest AP News And Telugu News