గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ భేటీ
ABN , Publish Date - Aug 14 , 2026 | 10:27 AM
గోదావరి పుష్కరాలు-2027పై కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో మంత్రి శ్రీధర్‌బాబు అధ్యక్షతన సమావేశం ప్రారంభమైంది.
హైదరాబాద్, ఆగస్టు 14: గోదావరి పుష్కరాలు-2027పై కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో మంత్రి శ్రీధర్‌బాబు అధ్యక్షతన సమావేశం ప్రారంభమైంది. పుష్కరాల ఏర్పాట్లు, సన్నద్ధతపై కీలక సమీక్ష నిర్వహించారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్ల పురోగతిపై అధికారులకు మంత్రి శ్రీధర్ బాబు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశానికి పలు శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
గోదావరి పుష్కరాలను తెలంగాణ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. తెలంగాణ బ్రాండ్‌ను ప్రతిబింబించేలా గోదావరి పుష్కరాలను నిర్వహించాలని ఏర్పాట్లు చేస్తోంది. 2027 జూన్ 26 నుంచి జులై 7 వరకు గోదావరి పుష్కరాలు జరగనున్నాయి.12 సంవత్సరాలకు ఓసారి బృహస్పతి సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు గోదావరికి పుష్కరాలు జరుగుతాయి. పుష్కరాల సమయంలో పవిత్ర నదీ స్నానాలు, పితృ తర్పణాలు, ప్రత్యేక పూజలు ఆచరించడం ద్వారా విశేష పుణ్యఫలం అని భక్తుల విశ్వాసం. ఈ పుష్కలకు తెలంగాణ రాష్ట్రంతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు తగినట్లుగా భారీగా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. గోదావరి నది ప్రవహించే జిల్లాల్లో, ప్రముఖ దేవాలయాలను అనుసంధానిస్తూ దాదాపు 96 ప్రాంతాలను పుష్కరాల కోసం సిద్ధం చేయాలని నిర్ణయించారు. పుష్కర ఘాట్లు, రోడ్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, వాహనాల పార్కింగ్ తదితర మౌలిక సదుపాయాల కోసం ప్రణాళికలు రూపొందించనున్నారు.
ఇవి కూడా చదవండి...
విషాదం: విద్యుత్ షాక్‌తో తండ్రీకొడుకు మృతి
Read Latest Telangana News And Telugu News