Share News

చిత్తూరులో దారుణం.. నిద్రిస్తున్న తండ్రిని కత్తితో నరికి హత్య..

ABN , Publish Date - Aug 14 , 2026 | 09:35 AM

చిత్తూరు జిల్లా ఎస్‌ఆర్‌ పురం మండలం క్షీర సముద్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు.. నిద్రిస్తున్న తండ్రిని కత్తితో నరికి హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

చిత్తూరులో దారుణం.. నిద్రిస్తున్న తండ్రిని కత్తితో నరికి హత్య..
Sheera Samudram incident

చిత్తూరు, ఆగస్టు 14: జిల్లాలోని ఎస్‌ఆర్‌ పురం మండలం క్షీర సముద్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నిద్రిస్తున్న తండ్రి ఆనంద్‌ (45)పై కుమారుడు కత్తితో దాడి చేసి హత్య చేశాడు. మద్యం మత్తులో ఉన్న కుమారుడు.. ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇంట్లో నిద్రిస్తున్న తండ్రిపై ఒక్కసారిగా కత్తితో దాడి చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. తండ్రిని హత్య చేసిన అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.


తండ్రిపై దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన సొంత అత్తపైనా నిందితుడు దాడి చేసినట్లు సమాచారం. అనంతరం ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయిన నిందితుడు స్వయంగా 108కు ఫోన్ చేసి ఘటన గురించి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనకు అసలు కారణం ఏమిటనేది ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


వార్తలు కూడా చదవండి...

ఈసీఐ పేరుతో ఓటర్లకు మోసపూరిత సందేశాలు: సీఈవో సుదర్శన్ రెడ్డి

ఢిల్లీ పేలుళ్ల వెనుక అల్‌ఖైదా కుట్ర.. యూఎన్ నివేదికలో కీలక విషయాలు

జగన్ హయాంలో అదనపు నీటిని ఏపీ తరలిస్తుంటే బీఆర్ఎస్ నేతలు ఎందుకు ప్రశ్నించలేదు: యెన్నెం శ్రీనివాస్ రెడ్డి

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Aug 14 , 2026 | 09:50 AM