Share News

మహేశ్వరరెడ్డి కేసులో కీలక మలుపు.. తోపుదుర్తి రాజారెడ్డి అరెస్ట్

ABN , Publish Date - May 26 , 2026 | 08:47 AM

రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత సంవత్సరం అనుమానాస్పద స్థితిలో తోపుదుర్తి మహేశ్వరరెడ్డి మృతిచెందిన విషయం తెలిసిందే.

మహేశ్వరరెడ్డి కేసులో కీలక మలుపు.. తోపుదుర్తి రాజారెడ్డి అరెస్ట్
Maheshwar Reddy Case

అనంతపురం, మే 26 (ఆంధ్రజ్యోతి): రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత సంవత్సరం అనుమానాస్పద స్థితిలో తోపుదుర్తి మహేశ్వరరెడ్డి మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే, మహేశ్వరరెడ్డిని తోపుదుర్తి సోదరులే హత్య చేశారంటూ ఆయన కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తోపుదుర్తి రాజారెడ్డిపై ఎస్పీ జగదీశ్‌కు ఫిర్యాదు చేశారు మహేశ్వరరెడ్డి తండ్రి మల్లారెడ్డి. ‘గత సంవత్సరం అనంతపురం రూరల్ మండలంలోని తాటిచెర్ల తోపుదుర్తి రాజారెడ్డి, తోపుదుర్తి చందు బెదిరించి మా కుమారుడు మహేశ్వరరెడ్డిని హత్య చేసి రైల్వేట్రాక్‌పై పడవేశారు’ అంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు మల్లారెడ్డి.


ఈ కేసును పోలీసులు పట్టించుకోవడంలేదంటూ ఎస్పీ జగదీశ్‌‌కు చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు మహేశ్వరరెడ్డి తండ్రి మల్లారెడ్డి. ఆధారాలు ఇచ్చి ఏడాది అవుతున్నప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదని మల్లారెడ్డి ప్రశ్నించారు. దీంతో తోపుదుర్తి సోదరులపై కేసు నమోదు చేశారు అనంతపురం రూరల్ పోలీసులు. మహేశ్వరరెడ్డిని బెదిరించిన కేసులో తోపుదుర్తి సోదరులతో పాటు తోపుదుర్తి గ్రామానికి చెందిన మరో ఐదుగురి ప్రమేయం ఉందని మల్లారెడ్డి చెబుతున్నారు. ఈ క్రమంలోనే తోపుదుర్తి రాజారెడ్డిని అరెస్ట్ చేసి అనంతపురం రూరల్ పోలీసుస్టేషన్‌కు తరలించారు.


రాజారెడ్డి బెదిరింపులతోనే మహేశ్వరరెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు: డీఎస్పీ శ్రీనివాసులు

తోపుదుర్తి రాజారెడ్డి అరెస్టుపై అనంతపురం రూరల్ డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడారు. తోపుదుర్తి రాజారెడ్డి బెదిరింపులతోనే మహేశ్వరరెడ్డి ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. రాజారెడ్డి బెదిరింపులకు సంబంధించిన ఆడియో, వీడియోలు ఉన్నాయని వెల్లడించారు. మహేశ్వరరెడ్డి ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించామని చెప్పుకొచ్చారు. మహేశ్వరరెడ్డి ఆత్మహత్య వెనుక రాజారెడ్డి ప్రమేయం ఉందంటూ ఆయన తండ్రి మల్లారెడ్డి ఫిర్యాదు చేశారని ప్రస్తావించారు. ఈ ఫిర్యాదు మేరకు సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. ఈ నేపథ్యంలోనే తోపుదుర్తి రాజారెడ్డి బెదిరింపులకు సంబంధించిన ఆడియో, వీడియో కాల్స్ వెలుగులోకి వచ్చాయని అన్నారు. ఈ కేసు విచారణలో భాగంగా సెక్షన్స్ మార్చి విచారణ చేస్తున్నామని తెలిపారు. ఈ కేసులో తోపుదుర్తి రాజారెడ్డితో పాటు జయపాల్ రెడ్డిని అరెస్ట్ చేశామని డీఎస్పీ శ్రీనివాసులు పేర్కొన్నారు.


14 రోజుల పాటు రిమాండ్..

తోపుదుర్తి ఉమామహేశ్వరరెడ్డి అనుమానాస్పద మృతి కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఉమామహేశ్వరరెడ్డి అనుమానాస్పద మృతి కేసును హత్యకేసుగా మార్చారు అనంతపురం రూరల్ పోలీసులు. ఈ కేసులో అరెస్ట్ చేసిన తోపుదుర్తి రాజశేఖరరెడ్డి, జైపాల్‌రెడ్డిలని మేజిస్ట్రేట్ ఎదుట పోలీసులు హాజరపరిచారు. 14 రోజుల పాటు మేజిస్ట్రేట్ వారికి రిమాండ్ విధించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా స్టార్టప్‌లను ప్రోత్సహిస్తాం: సీఎం చంద్రబాబు

గోదావరి పుష్కరాల పనుల్లో జాప్యం.. అధికారుల తీరుపై పవన్ అసహనం

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 26 , 2026 | 11:08 AM