గుత్తి మీదుగా తిరుపతికి రెగ్యులర్ రైలు
ABN , Publish Date - May 02 , 2026 | 12:33 PM
తిరుపతి-పండర్‌పూర్-తిరుపతి (వయా గుత్తి) ప్రత్యేక వీక్లీ రైలు (07012/32)ను రెగ్యులర్ రైలుగా మార్పు చేసినట్లు రైల్వే అధికారులు శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
గుంతకల్లు(అనంతపురం): తిరుపతి-పండర్‌పూర్-తిరుపతి (వయా గుత్తి) ప్రత్యేక వీక్లీ రైలు (07012/32)ను రెగ్యులర్ రైలుగా మార్పు చేసినట్లు రైల్వే అధికారులు శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తిరుపతి-పండర్‌పూర్ రెగ్యులర్ రైలు (17437)ను ఈ నెల 16 నుంచి, దీని తిరుగు ప్రయాణపు రైలు (17438)ను ఈ నెల 17వ తేదీ నుంచి రెగ్యులర్ వీక్లీగా మారుస్తున్నట్లు తెలిపారు. ఈ రైలు తిరుపతి, రేణిగుంట, రాజంపేట, కడప, యర్రగుంట్ల, తాడిపత్రి, గుత్తి, డోన్, గద్వాల, వనపర్తి రోడ్, మహబూబ్‌నగరర్, షాద్‌నగర్, కాచిగూడ, సికింద్రాబాద్, బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్, జహీరాబాద్, బీదర్, ఉదయగిరి, లాతూర్ రోడ్డు, ధారాశివ్, బర్సి టౌన్, కురుద్వాడి, మోబింద్ స్టేషన్ల మీదుగా పండర్‌పూర్‌కు చేరుకుంటుందన్నారు.

రైళ్ల రద్దు, దారి మళ్లింపు
నైరుతి రైల్వేలో జరుగుతున్న నాన్ ఇంటర్లాకింగ్ పనుల కారణంగా రెండు రైళ్లను రద్దుపరచి, మరి కొన్నింటిని పాక్షికంగా రద్దు పరచినట్లు రైల్వే అధికారులు తెలిపారు. బెంగళూరు-బీదర్ (06539) రైలును నెల 3న, దీని తిరుగు ప్రయాణపు రైలు (06540) ఈ నెల 4వ తేదీన రద్దుపరచినట్లు తెలియజేశారు. అలాగే గుంతకల్లు మీదుగా వెళ్లే ముంబై-బెంగళూరు-ముంబై ఎక్స్‌ప్రెస్ (11301/02) రైళ్లను ఈ నెల 3, 4 తేదీల్లోనూ, భువనేశ్వర్-బెంగళూరు ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ (18463) రైలును ఈ నెల 2, 3 తేదీల్లోనూ, దీని తిరుగు ప్రయాణపు రైలు (18464)ను ఈనెల 3, 4 తేదీల్లోనూ యల్హంక వరకే నడుపుతామని, యల్హంక-బెంగళూరు మధ్య ఈ రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు వివరించారు.
గుంతకల్లు మీదుగా వెళ్లే బెంగళూరు-నాందేడ్ (16593) ఎక్స్‌ప్రె్‌సను ఈనెల 3, 4 తేదీల్లో, మైసూరు-కాకినాడ టౌన్ (17290) ఎక్స్‌ప్రె్‌సను ఈ నెల 2వ తేదీన బెంగళూరు కంటోన్మెంటు స్టేషన్‌లో ఆపకుండా నడుపుతామన్నారు. కాచిగూడ-అశోకపురం (12785) ఎక్స్‌ప్రె్‌సను, దీని తిరుగు ప్రయాణపు రైలు (12786)ను ఈ నెల 3, 4 తేదీల్లో బెంగళూరు ఈస్ట్, బెంగళూరు కంటోన్మెంటు స్టేషన్లలో ఆపకుండా నడుపుతామన్నారు. ఈ మార్పులను గమనించి ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
పెరిగిన వెండి, బంగారం ధరలు.. ఈ రోజు ఎంతంటే..
Read Latest Telangana News and National News